AP; అమరావతిలో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి మలేషియా ఓకే

వెల్లడించిన మంత్రి నారాయణ.. చంద్రబాబుతో మలేషియా బృందం భేటీ

Update: 2025-10-04 04:30 GMT

ఏపీ రా­జ­ధా­ని అమ­రా­వ­తి­లో 10 వేల కో­ట్ల రూ­పా­యల పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­టా­ని­కి మలే­షి­యా ప్ర­తి­ని­ధు­లు అం­గీ­క­రిం­చి­న­ట్లు మం­త్రి నా­రా­యణ తె­లి­పా­రు. సచి­వా­ల­యం­లో మలే­షి­యా ప్ర­తి­ని­ధుల బృం­దం­తో ఆయన భేటీ అయ్యా­రు. ఈ సం­ద­ర్భం­గా పలు అం­శా­లు, పె­ట్టు­బ­డు­ల­పై చర్చ జరి­గిం­ది. అమ­రా­వ­తి ని­ర్మా­ణా­న్ని మూ­డే­ళ్ల­ల్లో పూ­ర్తి చే­యా­ల­నే లక్ష్యం­తో పను­లు జరు­గు­తు­న్న­ట్లు మం­త్రి మలే­షి­యా ప్ర­తి­ని­ధు­ల­కు వి­వ­రిం­చా­రు. దే­శం­లో­నే టాప్ 5 రా­జ­ధా­ని నగ­రా­ల్లో అమ­రా­వ­తి ఒకటి అని.. ఆ ది­శ­గా­నే ని­ర్మా­ణా­లు, అభి­వృ­ద్ధి పను­లు జరు­గు­తు­న్నా­య­ని మలే­షి­యా ప్ర­తి­ని­ధు­ల­కు వి­వ­రిం­చా­రు మం­త్రి నా­రా­యణ. అమ­రా­వ­తి వి­జ­న్ పరి­శీ­లిం­చిన మలే­షి­యా ప్ర­తి­ని­ధు­లు.. రా­బో­యే రెం­డే­ళ్ల­ల్లో 6 వేల నుం­చి 10 వేల కో­ట్ల రూ­పా­యల పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­ను­న్న­ట్లు హామీ ఇచ్చా­రు. అమ­రా­వ­తి­లో జరు­గు­తు­న్న ని­ర్మాణ పను­ల­ను మలే­షి­యా ప్ర­తి­ని­ధు­లు సైతం స్వ­యం­గా పరి­శీ­లిం­చా­రు .

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

అమ­రా­వ­తి సచి­వా­ల­యం­లో సీఎం చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన కే­బి­నె­ట్ సమా­వే­శ­మై 20 అజెం­డా అం­శా­ల­పై చర్చిం­చిం­ది. ల్యాం­డ్‌ ఇన్సెం­టి­వ్‌ ఫర్‌ టె­క్ని­క­ల్‌ హబ్స్‌ (లి­ఫ్ట్) పా­ల­సీ 2024-29 అను­బంధ ప్ర­తి­పా­ద­న­ల­కు మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది. జల­వ­న­రుల శా­ఖ­కు సం­బం­ధిం­చి వి­విధ పను­ల­కు గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ది. కా­ర­వా­న్‌ పర్యా­ట­కా­ని­కి, అమృ­త్‌ పథకం 2.0 పను­ల­కు మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది. అమ­రా­వ­తి­లో వి­విధ పనుల వే­గ­వం­తా­ని­కి స్పె­ష­ల్‌ పర్ప­స్‌ వె­హి­క­ల్‌ (ఎస్‌­పీ­వీ) ఏర్పా­టు­కు ఆమో­ద­ము­ద్ర వే­సిం­ది. అమ­రా­వ­తి సహా రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా పలు సం­స్థ­ల­కు భూ­కే­టా­యిం­పుల ప్ర­తి­పా­ద­న­ల­కు ఆమో­దం తె­లి­పిం­ది. కు­ష్ఠు వ్యా­ధి పదం తొ­ల­గిం­చేం­దు­కు వీ­లు­గా చట్ట­స­వ­రణ చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. వి­ద్యు­త్‌ శా­ఖ­కు సం­బం­ధిం­చి పలు ప్ర­తి­పా­ద­న­ల­కు, కా­ర్మిక చట్టా­ల్లో పలు సవ­ర­ణల ప్ర­తి­పా­ద­న­ల­ను మం­త్రి­వ­ర్గం ఆమో­దిం­చిం­ది. ఆటో, క్యా­బ్‌ డ్రై­వ­ర్ల­కు రూ.15వేల ఆర్థిక సాయం అం­దిం­చే పథ­కా­నికి మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది.

అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు

పా­ర్వ­తీ­పు­రం మన్యం జి­ల్లా­లో­ని నా­గా­వ­ళి, వం­శ­ధార నదు­ల్లో వరద ఉద్ధృ­తి పె­రు­గు­తోం­ది. ఈ క్ర­మం­లో మం­త్రి అచ్చె­న్నా­యు­డు అధి­కా­రు­ల­ను అప్ర­మ­త్తం చే­శా­రు. వరద ము­ప్పు దృ­ష్యా అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని జి­ల్లా కలె­క్ట­ర్‌, ఎస్పీ­ల­కు తె­లి­పా­రు. కం­ట్రో­ల్ రూమ్ సే­వ­ల­తో క్షే­త్ర­స్థా­యి­లో అధి­కా­రు­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­న్నా­రు. గా­లు­లు, భారీ వర్షాల సమ­యం­లో ప్ర­జ­లు బయ­ట­కు రా­వ­ద్ద­ని మం­త్రి వి­జ్ఞ­ప్తి చే­శా­రు. అధి­కా­రు­లు ని­రం­త­రం అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని మం­త్రి ఆదే­శిం­చా­రు.

Tags:    

Similar News