ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు చేశారు. బాగా పని చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేశ్‌కుమార్ మీనా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్.. కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్.. ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్, పరిశ్రమలు, కార్మికశాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు, రెవెన్యూ (ఎండోమెంట్) కార్యదర్శిగా హరి జవహర్లాల్ నియమితులయ్యారు.
హిందీ తప్పనిసరని చెప్పలేదు: లోకేశ్
హిందీ తప్పనిసరి అని జాతీయ విద్యా విధానంలో ఎక్కడా చెప్పలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానంపై ఇండియా టుడే నిర్వహించిన సౌత్ కాంక్లేవ్ లో మాట్లాడిన లోకేష్.. జాతీయ విద్యా విధానం కేవలం మూడు భాషలు నేర్చుకోవాలని మాత్రమే చెప్పిందన్నారు. హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని చెప్పలేదన్నారు. అయితే హిందీ నేర్చుకోవవడం మనకెంత ముఖ్యమో తనకు బాగా తెలుసని చెప్పారు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కలిసినపుడు మాతృభాషలో పాఠ్యాంశాల బోధనపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిపారు.‘నేను మూడు భాషలు నేర్చుకున్న. నా కుమారుడూ అదే పని చేస్తున్నారు. ఇవాళ పిల్లలు ఐదు భాషలు నేర్చుకుంటున్నారు. ఇవాళ పిల్లలు ఐదు భాషలు నేర్చుకుంటున్నారు. జర్మన్, జపనీస్ ఇలా ఎన్నో భాషలు ఉన్నాయి. అవి నేర్చుకుంటే ఆ దేశాల్లో పని చేయడానికి వీలవుతుంది. భాషలు నేర్చుకుంటే మంచిదే’ అని వివరించారు.