AP: : పారదర్శకంగా ‘ఉచిత గ్యాస్ సిలిండర్’ పథకం
అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి ఇస్తామన్న మంత్రి నాదెండ్ల.. వైసీపీ ఓర్వలేకనే ఆరోపణలు చేస్తోందని మండిపాటు;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుకగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. తాజాగా ఈ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఈనేపథ్యంలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని తీసుకుచ్చిందన్నారు. దీన్ని ఓర్వలేకనే.. లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ పథకం అమలులోకి వచ్చి నెల రోజులు అయినా పూర్తి అవ్వకుండానే.. లక్షల మంది ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకంలో లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ఉచితంగా గ్యాస్ అందిస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉచితంగా గ్యాస్ బుక్ చేసుకున్న 40 లక్షల మందిలో.. 30లక్షల మంది అకౌంట్లో వారు ముందుగా చెల్లించిన నగదు జమ చేసినట్లు తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పూర్తి పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమమన్నారు. ఈ పథకం ప్రకారం ఏడాదికి మూడు సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
అద్భుత స్పందన
ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అద్భుతమైన స్పందన వస్తోంది. అక్టోబర్ 31వ తేదీన ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన నాటి నుంచి ఈ పథకానికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 40 లక్షల మంది వినియోగదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. టీడీపీ కూటమి సర్కారు ఇంత అద్భుతమైన కార్యక్రమం అమలు చేస్తున్నందుకు వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.మరోవైపు దీపం 2.0 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఇప్పటి వరకూ రాష్ట్రంలోని 40 లక్షల మంది బుకింగ్ చేసుకున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. వీరిలో 30 లక్షల మందికి ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ అందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్న నాదెండ్ల మనోహర్.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి సిలిండర్ కోసం మార్చి 31, 2025 వరకు బుకింగ్ చేసుకోవచ్చని.. ఇందుకు నిధులు కూడా కేటాయించిన సంగతిని గుర్తు చేశారు.మరోవైపు తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది. ఏడాదికి మూడు సిలిండర్లకు నాలుగు నెలలకు ఒకటి చొప్పున అందజేయనుంది.