AP: ఫేక్ న్యూస్ కట్టడికి కొత్త చట్టం!

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం... నకిలీ వార్తల కట్టడికి చట్టం తేవాలని నిర్ణయం... కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన కేబినెట్

Update: 2025-09-05 04:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం మరో కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. సో­ష­ల్ మీ­డి­యా­లో తప్పు­డు వా­ర్తల ప్ర­చా­రా­ని­కి అడ్డు­క­ట్ట వే­సేం­దు­కు కొ­త్త చట్టం తీ­సు­కు­రా­వా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. ప్ర­భు­త్వం చే­ప­డు­తు­న్న మంచి కా­ర్య­క్ర­మా­ల­ను సైతం వి­మ­ర్శి­స్తూ సో­ష­ల్ మీ­డి­యా­లో పో­స్టు­లు దర్శ­న­మి­స్తు­న్నా­యి. వీ­టి­పై ఆగ్ర­హం­గా ఉన్న ప్ర­భు­త్వం.. కే­బి­నె­ట్ భే­టీ­లో ఈ వి­ష­యా­న్ని కీ­ల­కం­గా చర్చిం­చిం­ది. మం­త్రు­ల­తో సో­ష­ల్ మీ­డి­యా పో­స్టుల అరా­చ­కం­పై చర్చిం­చిన సీఎం చం­ద్ర­బా­బు అనం­త­రం కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­రు. ఏఐ ఫో­టో­లు, వీ­డి­యో­లు, ఫేక్ న్యూ­స్ తో ప్ర­భు­త్వం­పై తప్పు­డు ప్ర­చా­రం చే­య­డం ఎక్కు­వై­పో­యిం­ద­ని ఏపీ ప్ర­భు­త్వం ఇప్ప­టి­కే ఆగ్ర­హం వ్య­క్తం చే­స్తోం­ది. ఫేక్ న్యూ­స్ కట్ట­డి­కి ప్ర­త్యేక చట్టం తీ­సు­కు రా­వా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. సో­ష­ల్ మీ­డి­యా­లో తప్పు­డు పో­స్టుల ని­వా­ర­ణ­కు సీఎం చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన జరి­గిన మం­త్రి వర్గ సమా­వే­శం­లో చర్చిం­చా­రు. తప్పు­డు పో­స్టుల ని­వా­ర­ణ­కు తీ­సు­కు­రా­వా­ల్సిన వి­ధి­వి­ధా­నా­ల­పై చర్చిం­చా­రు. మం­త్రి­వ­ర్గ ఉప­సం­ఘం ఏర్పా­టు చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. మం­త్రు­లు అనిత, నా­దెం­డ్ల, అన­గా­ని, పా­ర్థ­సా­ర­ధి­తో ఉప­సం­ఘం ఏర్పా­టు చే­శా­రు. కొ­త్త చట్టం తీ­సు­కొ­చ్చేం­దు­కు ని­బం­ధ­న­ల­ను రూ­పొం­దిం­చ­ను­న్నా­రు.

కఠిన చర్యలు ఉండేలా...

తప్పు­డు పో­స్టు­లు పె­ట్టే­వా­రి­పై కఠిన చర్య­లు ఉం­డే­లా చట్టం ఉం­డా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు మం­త్రి­వ­ర్గ ఉప­సం­ఘం సభ్యు­ల­కు తె­లి­పా­రు. రా­ష్ట్రం­లో ఇప్ప­టి­కే అధి­కార కూ­ట­మి­కీ, వి­ప­క్షం­లో వై­సీ­పీ­కీ మధ్య సో­ష­ల్ వార్ తీ­వ్రం­గా సా­గు­తోం­ది. ఇదే క్ర­మం­లో ప్ర­భు­త్వం తీ­సు­కుం­టు­న్న ని­ర్ణ­యా­ల­ను సైతం తప్పు­బ­డు­తూ వై­సీ­పీ సో­ష­ల్ వార్ సా­గి­స్తోం­ది. తా­జా­గా యూ­రి­యా అం­శం­లో కొరత ఉం­దం­టూ స్వ­యం­గా వై­సీ­పీ అధి­నేత వై­ఎ­స్ జగన్ ని­న్న సు­దీ­ర్ఘం­గా ట్వీ­ట్ చే­శా­రు. వీ­టి­పై ఆగ్ర­హం­గా ఉన్న సీఎం చం­ద్ర­బా­బు ఇవాళ కే­బి­నె­ట్ లోనే వై­సీ­పీ నే­త­ల­కు హె­చ్చ­రి­క­లు పం­పా­రు.

సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

సు­గా­లి ప్రీ­తి కే­సు­ను సీ­బీ­ఐ­కి అప్ప­గిం­చా­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. సు­గా­లి ప్రీ­తి కు­టుం­బా­ని­కి అం­డ­గా ఉన్నం­దు­కు తనను టా­ర్గె­ట్ చే­స్తు­న్నా­ర­ని డి­ప్యూ­డీ సీఎం పవన్ కళ్యా­ణ్ మం­త్రి­వ­ర్గ సమా­వే­శం­లో అన్నా­రు . స్వా­ర్థ రా­జ­కీ­యాల కోసం చేసే వి­ష­ప్ర­చా­రా­న్ని ధీ­టు­గా తి­ప్పి­కొ­డ­దా­మ­ని పవన్ అన్నా­రు. యూ­రి­యా­పై జరు­గు­తు­న్న దు­ష్ప్ర­చా­రం­పై­నా కే­బి­నె­ట్ భేటీ తర్వాత.. మం­త్రు­ల­తో చం­ద్ర­బా­బు చర్చిం­చా­రు . ఎరు­వు­ల­కు ఇబ్బం­ది లే­కు­న్నా దు­ష్ప్ర­చా­రం చే­స్తు­న్నా­ర­ని మండిపడ్డారు.

Tags:    

Similar News