ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను స్వాగతించిన చంద్రబాబు
ఎన్నికల నిర్వహణను గతంలోనే టీడీపీ స్వాగతించింది అన్నారు చంద్రబాబు.;
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ విడుదలను టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. ఎన్నికల నిర్వహణను గతంలోనే టీడీపీ స్వాగతించింది అన్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ పై పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫెరెన్స్ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అధినేతతో సమావేశం ముగిసిన తరువాత ఎన్నికల అంశపై టీడీపీ నేతలు స్పందిస్తారు.