AP: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మెగా టెర్మినల్స్
రైల్వే శాఖ భారీ ప్రణాళిక... అమరావతిలో మెగా టెర్మినల్.. గన్నవరంలోనూ నిర్మించే ప్లాన్.. 8 ఫ్లాట్‌ఫామ్‌లతో మెగా టెర్మినల్
ఏపీలో మెగా టెర్మినల్స్ నిర్మించేందుకు రైల్వే శాఖ భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంది. అమరావతి, గన్నవరం వంటి ఏరియాల్లో మెగా టెర్మినల్స్ నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. . అమరావతి మీదుగా ఫ్యూచర్ లో పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు ప్రయాణించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి, గన్నవరం ప్రాంతాల్లో మెగా టెర్మినల్స్ నిర్మించేందుకు భారీ ఎత్తున రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైళ్లు ప్రయాణించే అవకాశం లేకపోలేదు. దీంతో ఫ్లాట్ ఫామ్‌లో తో టెర్మినల్ నిర్మాణానికి రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అదే సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్ పై ఒత్తిడి తగ్గించేలా గన్నవరం టెర్మినల్ అభివృద్ధి చేయబోతున్నారు. దీంతో పాటు విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా మరిన్ని ఎక్కువ రైళ్ల రాకపోకలకు వీలుగా విస్తరణ పనులు కూడా చేపట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రాజధాని మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 56 కిలో మీటర్ల కొత్త రైల్వే కూడా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అమరావతి ప్రధాన స్టేషన్ ను మెగా కోచింగ్ టెర్మినల్ గా నిర్మించబోతున్నారు. ఇందులో ఎనిమిది రైల్వే లైన్లు అలాగే 8 ఫ్లాట్ ఫామ్ లు నిర్మించనున్నట్లు సమాచారం. ఈ స్టేషన్ గుండా 120 రైళ్లు ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు.. రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు.టెర్మినల్ కోసం 300 ఎకరాలు అవసరమవుతాయని రైల్వే శాఖ అంచనా వేసింది. గన్నవరం రైల్లే స్టేషన్ ను మెగా కోచింగ్ టెర్మినల్ గా అభివృద్ధి చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. నిర్మాణం కోసం 143 ఎకరాలు కావాల్సి ఉంది.
120 రైళ్ల రాకపోకలకు సదుపాయం
రాజధాని మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య 56 కి.మీ. పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. ఈ మార్గంలో అమరావతిని ప్రధాన స్టేషన్‌గా రూపొందించి, దానిని మెగా కోచింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తారు. ‘కోచింగ్ టెర్మినల్’ అంటే ఒక స్టేషన్ నుంచి ప్రయాణికుల కోచ్‌లతో రైళ్లు బయలుదేరి, అక్కడే వాటి ప్రయాణం ముగిసే స్టేషన్. అటువంటి రైళ్ల కోచ్‌ల నిర్వహణ పనులు కూడా అక్కడే జరుగుతాయి. అమరావతిలో కూడా ఇటువంటి టెర్మినల్ నిర్మించనున్నారు.ఈ టెర్మినల్‌లో 8 రైల్వే లైన్లు, 8 ప్లాట్‌ఫాంలు నిర్మించనున్నారు. ఒక్కో ప్లాట్‌ఫాంపై 24 ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల రైళ్లు నిలిపేలా సదుపాయాలు కల్పిస్తారు. ఈ స్టేషన్ 120 రైళ్ల రాకపోకలకు తగిన సామర్థ్యం కలిగి ఉంటుంది. రైళ్ల నిర్వహణ కోసం 6 పిట్ లైన్లు నిర్మించనున్నారు.