ap: సోషల్ మీడియా కేసులు.. హైకోర్టు వార్నింగ్

Update: 2025-07-07 04:30 GMT

సు­ప్రీం­కో­ర్టు మా­ర్గ­ద­ర్శ­కాల మే­ర­కే సో­ష­ల్‌ మీ­డి­యా కే­సు­ల్లో రి­మాం­డ్‌ వి­ధి­స్తు­న్న­ట్లు ఏపీ హై­కో­ర్టు స్ప­ష్టం చే­సిం­ది. సో­ష­ల్‌ మీ­డి­యా­లో అను­చిత, అభ్యం­త­ర­కర పో­స్టు­లు, వ్యా­ఖ్యల కే­సు­ల్లో నిం­ది­తు­ల­కు రి­మాం­డ్‌ వి­ధిం­చే సమ­యం­లో సు­ప్రీం­కో­ర్టు మా­ర్గ­ద­ర్శ­కా­ల­ను పా­టిం­చా­ల­ని తే­ల్చి చె­ప్పిం­ది. ఈ మే­ర­కు ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని మే­జి­స్ట్రే­ట్ల­కు హై­కో­ర్టు స్ప­ష్టం చే­సిం­ది. ఈ ఆదే­శా­ల­ను ఉల్లం­ఘి­స్తే శా­ఖా­ప­ర­మైన వి­చా­రణ, కో­ర్టు ధి­క్కా­రణ చర్య­లు ఉం­టా­య­ని హె­చ్చ­రిం­చిం­ది. ఈ మే­ర­కు మే­జి­స్ట్రే­ట్‌­ల­కు వి­వ­రా­లు వె­ల్ల­డి­స్తూ.. రి­జి­స్ట్రా­ర్‌ జ్యు­డీ­షి­య­ల్‌ సర్క్యు­ల­ర్‌ జారీ చే­శా­రు. సో­ష­ల్‌ మీ­డి­యా­లో అను­చిత, అభ్యం­త­ర­కర పో­స్టు­లు, వ్యా­ఖ్య­ల­కు సం­బం­ధిం­చిన కే­సు­ల్లో నిం­ది­తు­ల­కు రి­మాం­డ్‌ వి­ధిం­చే సమ­యం­లో సు­ప్రీం­కో­ర్టు మా­ర్గ­ద­ర్శ­కా­ల­ను పా­టిం­చా­ల­ని సూ­చిం­చిం­ది. నిం­ది­తు­ల­కు రి­మాం­డ్‌ వి­ధిం­చే సమ­యం­లో అర్నే­‌­ష్‌­కు­మా­ర్‌ వర్సె­స్‌ స్టే­ట్‌ ఆఫ్‌ బీ­హా­ర్‌ కే­సు­లో సు­ప్రీం­కో­ర్టు మా­ర్గ­ద­ర్శ­కా­ల­ని పట్టిం­చు­కో­కుం­డా మే­జి­స్ట్రే­ట్‌­లు నిం­ది­తు­ల­కు రి­మాం­డ్‌ వి­ధి­స్తు­న్న­ట్లు కో­ర్టు దృ­ష్టి­కి వచ్చిం­ద­ని ఏపీ హై­కో­ర్టు గు­ర్తు­చే­సిం­ది. ఇలాం­టి కే­సు­ల్లో ముం­దు­గా వి­చా­రణ చే­శా­కే మే­జి­స్ట్రే­ట్లు ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల­ని హైకో­ర్టు సూ­చిం­చిం­ది.

Tags:    

Similar News