ఉత్తర ప్రదేశ్ లోని లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా 2 బస్సుల్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే నెల 11న తిరుపతి నుంచి, 12న నెల్లూరు నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం.. తిరుపతి బస్సు కడప, కర్నూలు, హైదరాబాద్ మీదుగా వెళ్తుంది. తిరిగి 18న తిరుపతికి చేరుకుంటుంది. ఇక నెల్లూరు బస్సు విజయవాడ, రాజమహేంద్రవరం, వైజాగ్ మీదుగా వెళ్లి 19న నెల్లూరుకు తిరిగిరానుంది.
తిరుపతి, కడప నుంచి పెద్దలకు రూ.22 వేలు, పిల్లలకు రూ.19 వేలు, కర్నూలు, హైదరాబాద్ నుంచి పెద్దలకు రూ.20 వేలు, పిల్లలకు రూ.17,200గా ఛార్జీలు నిర్ణయించారు. నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం నుంచి పెద్దలకు రూ.25,600, పిల్లలకు రూ.22,500, విశాఖపట్నం నుంచి పెద్దలకు రూ.24,100, పిల్లలకు రూ.21,200 ఛార్జీలుగా నిర్ణయించారు. యాత్రలో దర్శనాలు, అల్పాహారం, భోజన ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.