జోగి బ్రదర్స్ కు ముడుపులు.. కల్తీ లిక్కర్ కేసులో నిజాలు

Update: 2025-11-23 07:00 GMT

ఏపీలో కల్తీ లిక్కర్ కేసు ఎంతటి సంచలనం రేపిందో మనం చూసాం. ఎంతోమంది జీవితాలను సర్వనాశనం చేసింది ఈ కల్తీ లిక్కర్ దందా. వైసిపి నేతలు సాగించిన ఈ అరాచక కాండలో ఎంతోమంది బలైపోయారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి కోట్లు సంపాదించారని వైసీపీ నేతలు చేసిన పాపం ఇప్పుడు పండింది. కల్తీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు ఒక్కొక్క నిజాన్ని బయటకు లాగుతున్నారు. మొదట్లో అసలు తనకేం సంబంధం లేదని పెద్ద బిల్డప్ ఇచ్చిన జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇక అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.

అద్దేపల్లి జనార్దన్ రావు ఇప్పుడు అప్రూవల్ గా మారి అసలు నిజాలను సిట్ ముందు ఉంచుతున్నారు. అతను ఆఫ్రికా వెళ్లే ముందు జోగి బ్రదర్స్ కు ముడుపులు ఇచ్చినట్లు ఒప్పేసుకున్నాడు. జోగి రాముతో జనార్ధన్ రావు చాలాసార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వీళ్ళిద్దరూ కల్తీ లిక్కర్ దందా గురించి అనేక విషయాలు సీక్రెట్ గా మాట్లాడుకున్నట్టు సిట్ అధికారుల విచారణలో తేలింది. జోగి రమేష్ చెప్పింది అంతా అబద్ధమే అని తేలిపోయింది.

అద్దేపల్లి జనార్దన్ రావు ముందుండి నడిపిస్తే.. ఆయన వెనుకుంటే నడిపించింది మాత్రం జోగి బ్రదర్స్. ఇందుకు సంబంధించిన కీలక సాక్ష్యాలు కూడా సిట్ అధికారులకు దొరికాయి. జోగి బ్రదర్స్ ఎన్ని చేసినా సరే తప్పించుకోలేని కీలక ఆధారాలను సిట్ దొరకపట్టడంతో జోగి బ్రదర్స్ ఏం చేసినా సరే తప్పించుకోలేరు. ఇలా సిట్ విచారణలో అన్ని బయటపడటంతో ఏపీ ప్రజలు వైసిపి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంత పెద్ద ఎత్తున కల్తీ లిక్కర్ దందా చేసి ఏపీ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతారా అంటూ ఏకిపారేస్తున్నారు. వైసిపి అడ్డంగా దొరికిపోతే దాన్ని కవర్ చేయడానికి ఫేక్ ప్రచారాలను తెరమీదకి తీసుకువస్తుందని మనకు తెలిసిందే కదా. అందుకే ఇప్పుడు ఏపీలో కల్తీ లిక్కర్, కల్తీ నెయ్యి కేసులను డైవర్ట్ చేయడానికి విజయవాడలో గోవధ అంటూ కొత్త రాగం ఎత్తుకుంది. పైగా ఏపీలో కూటమి ప్రభుత్వం కల్తీ లిక్కర్ అమ్ముతోంది అంటూ పసలేని ప్రచారాలు చేస్తోంది. కానీ వాళ్ళు ఎన్ని చేసినా సరే ఏపీ ప్రజలు మాత్రం నమ్మట్లేదు.

Tags:    

Similar News