ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ఏలూరు జేసీ ధాత్రి రెడ్డిని నియమించింది. ఫైబర్‌నెట్ ఎండీగా కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి శర్మ, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ఎండీగా పాడేరు సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్‌లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఐపీఎస్ రాహుల్ దేవ్ శర్మకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీఎస్‌బీసీఎల్ ఎండీగా అదనపు బాధ్యతలతో పాటు డిస్టిలరీస్ అండ్ బ్రేవరీస్ కమిషనర్‌గా పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు.
14 జిల్లాలకు కొత్త ఎస్పీలు
రాష్ట్రంలోని 14 జిల్లాలకు ప్రభుత్వం కొత్త ఎస్పీలను నియమించింది. వీరిలో ఏడుగురు ప్రస్తుతం వివిధ జిల్లాల్లో ఎస్పీలుగా కొనసాగుతున్నారు. వారిని అక్కడి నుంచి వేరే జిల్లాలకు బదిలీ చేసింది. ఇతర విభాగాల బాధ్యతల్లో ఉన్న మరో ఏడుగురు అధికారులకు వివిధ జిల్లాల్లో ఎస్పీలుగా అవకాశం కల్పించింది.