AP, TS : "పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలి"

Update: 2023-04-04 04:27 GMT

పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని.. ప్రాజెక్టు అథారిటీ, ఏపీ ప్రభుత్వానికి.. కేంద్ర జలసంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ తెలిపింది. తెలంగాణ ఒత్తిడి నేపథ్యంలో ముంపుపై అధ్యయనం కోసం నియమిత కాలపరిమితిని విధించినట్లు పేర్కొంది. ఢిల్లీలో జరిగిన CWC సమావేశంలో.. తెలంగాణ తరపున ఇంజనీర్లు మరోమా రు వాదనలను బలంగా వినిపించారు. పోలవరం ప్రాజెక్టు ముంపుపై సర్వే నిర్వహణను ఏపీ తాత్సారం చేస్తుండడాన్ని తీవ్రంగా నిరసించిన తెలంగాణ.. CWC గతంలో ఆదేశాలు జారీ చేసినా ఏపీ అసంబద్ధ వాదనలతో సర్వేకు ముందుకు రాలేదని తప్పుబ ట్టింది. పోలవరం FRL నీటిని నిల్వ చేసినప్పుడు.. తెలంగాణ భూభాగంలో ఏర్పడుతున్న ముంపును గుర్తించాలని పేర్కొంది. డ్రైనేజీ, స్థానిక ప్రవాహాలు నిలిచిపోవడం వల్ల వాటిల్లే ప్రభావాలు జులై 2022 వరదలపై తాజాగా ఉమ్మడి అధ్యయనం చేపట్టాల ని కోరింది.

మణుగూరు భారజల కేంద్రం, చారిత్రాక భద్రాది ఆలయం రక్షణకు చర్యలు చేపట్టాలని కోరిన తెలంగాణ.. కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని తెలిపింది. భద్రాచలంలో 8 అవుట్‌ ఫాల్‌ రెగ్యులేటర్‌ల స్థాయిలను ధృవీకరించాలని పేర్కొంది. పోల వరం ప్రాజెక్టు కారణంగా కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల నీటి పారుదల రద్దీకి సంబంధించి.. NGT ఉత్తర్వులను అనుసరిం చి వాటితోపాటు ఇతర పెద్ద స్థానిక ప్రవాహాలపై కూడా సర్వే చేయాల ని కోరింది. సంయుక్త సర్వే తర్వాత పుణేలోని CWPRS ఇతర నిపుణులతో వీలైనంత త్వరగా సంబంధిత మోడల్‌ అధ్యయనాలను చేయించాలని కోరింది. అప్పటివరకు ఏపీ ప్రభు త్వం పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వచేయ డం, జలాశయాన్ని నిర్వహించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టరాదని డిమాండ్ చేసింది.

తమ ఒత్తిడి, నిరసనతో ఉమ్మడి సర్వే పూర్తికి నియమిత కాలపరిమితి విధిస్తూ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కేంద్ర జలసం ఘం అల్టిమేటం జారీ చేసిందని తెలంగాణ తెలిపింది. ఈ నెల 10న తెలంగాణ, ఏపీతో సమావేశం ని ర్వహించాలని పీపీఏను ఆదేశించినట్లు పేర్కొంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు సైతం పలు డిమాండ్లను CWCకి నివేదించినట్లు తెలంగాణ వివరించింది.

Tags:    

Similar News