ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసుపై కేంద మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని అందరికీ తెలుసన్న పెమ్మసాని... ఏం ఆధారాలు లేకుండా ఎంపీని అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. అయితే, బిగ్ బాస్ ను కూడా ఆధారాలు దొరకగానే అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు.. ఈ స్కామ్ లో సిట్ అన్ని ఆధారాలు సేకరిస్తుందని వెల్లడించారు. అంటే బిగ్ బాస్ జగన్ అరెస్ట్ కూడా త్వరలోనే ఉంటుందని పెమ్మసాని పరోక్షంగా చెప్పేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ తో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, పథకాలకు యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు ఫించన్ పెంచడానికే ఐదేళ్లు పట్టిందని మండిపడ్డారు.