AP: కౌంటింగ్‌ను బహిష్కరించిన వైసీపీ

టీడీపీ గెలుపు ఖాయం..!;

Update: 2025-08-14 04:30 GMT

పులివెందుల, ఒంటిమిట్టజడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 10 టేబుల్లలో ఒక రౌండ్ ఒంటిమిట్టకు సంబంధించి పది టేబుల్లలో మూడు రౌండ్లు ప్రకారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. అయితే, కౌంటింగ్‌ను వైసీపీ బహిష్కరించింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ శ్రేణులు తెలిపారు.

టీడీపీ గెలుపు ఖాయం..!

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను వైసీపీ బహిష్కరించడం సంచలనంగా మారింది. ఓట్ల లెక్కింపు ఆరంభమైన కాసేపటికే వైసీపీ కౌంటింగ్‌ను బహిష్కరించడంతో ఆ పార్టీ ఓటమిని ముందే అంగీకరించిందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతల మాటలను పరిశీలిస్తే ఓటమి ఖాయమనే ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. కౌంటింగ్ బహిష్కరణతో ఇప్పుడు ఆ వాదనలకు మరింత బలం చేకూరింది. 

విమర్శలకు సమాధానం

2021లో జరి­గిన కడప స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో 52 స్థా­నా­ల­కు 49 సీ­ట్ల­ను ఏక­గ్రీ­వం చే­సు­కుం­ది వై­సీ­పీ. అం­దు­లో మూడు సీ­ట్ల­కు ఎన్ని­క­లు జరి­గి­తే వా­టి­ని వై­సీ­పీ సొం­తం చే­సు­కుం­ది. వం­ద­కు 100 శాతం వై­సీ­పీ గె­లి­చిం­ది. ప్ర­జా­స్వా­మ్యం­లో అది సా­ధ్య­మా? అన్న­ది తొలి ప్ర­శ్న. తొ­లి­సా­రి పు­లి­వెం­దు­ల­లో ఎన్నిక జరి­గిం­ది. కే­డ­ర్‌ చె­ది­రి­పో­కుం­డా బీ­టె­క్ రవి ఎప్ప­టి­క­ప్పు­డు పా­ర్టీ శ్రే­ణు­ల­ను అల­ర్ట్ చే­శా­రు. ఇన్ని జా­గ్ర­త్త­లు తీ­సు­కో­వ­డం ఈసా­రి కచ్చి­తం­గా పు­లి­వెం­దు­ల్లో టీ­డీ­పీ జెం­డా ఎగ­ర­డం ఖా­యం­గా కని­పి­స్తోం­ది. హై­క­మాం­డ్ నుం­చి అం­డ­దం­డ­లు ఉం­డ­డం, జమ్మ­ల­మ­డు­గు ఎమ్మె­ల్యే ఆది­నా­రా­యణ రె­డ్డి సహ­కా­రం కలి­సి వచ్చిం­ద­ని అం­టు­న్నా­రు. మొ­త్తా­ని­కి జగన్ తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­లే ఆ పా­ర్టీ పత­నా­ని­కి కా­ర­ణ­మ­ని అం­టు­న్నా­రు స్థా­ని­కు­లు. పు­లి­వెం­దు­ల­తో­పా­టు ఒం­టి­మి­ట్ట కూడా టీ­డీ­పీ­కే ఎడ్జ్ ఉం­ద­ని అం­టు­న్నా­రు. ఈ ఉప ఎన్నిక నుం­చి జగన్ పా­ఠా­లు నే­ర్చు­కుం­టా­రా? అన్న­ది చూ­డా­లి. జగన్ అడ్డాలో వైసీపీ అధినేతకు షాక్ ఇస్తుందా..? లేక ఓటమిని చవిచూస్తుందా..? ఈ ఎన్నికలతో 35 ఏళ్ల తర్వాత పులివెందులలో పసుపు జెండా ఎగురుతుందా అన్న ప్రశ్నలకు ఇవాళ్టీ ఫలితాలతో స్పష్టత రానుంది. ఏదిఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కాక రేపిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ స్థానాల ఫలితాల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది.

Tags:    

Similar News