Ashok Gajapathi Raju: మాన్సాస్ స్థలాలపై దౌర్జన్యం చేస్తే కుదరదు: అశోక్ గజపతిరాజు
Ashok Gajapathi Raju: మాన్సాస్ స్థలాలపై దౌర్జన్యం చేస్తే కుదరదని, ప్రొసీజర్ ఫాలో కావాలన్నారు అశోక్ గజపతిరాజు.;
Ashok Gajapathi Raju: మాన్సాస్ స్థలాలపై దౌర్జన్యం చేస్తే కుదరదని, ప్రొసీజర్ ఫాలో కావాలన్నారు ట్రస్టు ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు. మాన్సాస్ స్థలం విషయంలో జరిగిన వ్యవహరాన్ని ఆయన ఖండించారు. స్థలాన్ని కొలతలు వేయడానికి బుల్డొజర్ ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. మాన్సాస్ ల్యాండ్ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఎందుకు కేసు పెట్టడంలేదని ఆయన అధికారులను నిలదీశారు.
కేసులు పెట్టకుండా కలెక్టర్, ఎస్పీలకు ఈవోలు లేఖలు రాయడం ఏంటన్నారు. గతంలో తనపై చేయని తప్పుకు ఈవో కేసు పెట్టారని, ఇప్పుడు ఎందుకు పెట్టలేక పోతున్నారన్నారు. మాన్సాస్ ఆడిట్ వ్యవహరంలో అధికారులు నిబంధనలు పాటించడంలేదని ఆరోపించారు.