వైసీపీ అరాచకాలు తట్టుకోలేక ప్రజలు అత్యంత దారుణంగా ఓడించినా సరే వాళ్లలో సరైన మార్పు కనిపించట్లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను ఎన్నడూ గౌరవించలేదు. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీని కనీసం గౌరవించట్లేదు. అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ నేతల తీరు ఇక్కడే మనకు కనిపిస్తోంది. ఏమైనా అంటే వాళ్లకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం అనే ఒక సాకు చూపిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నిన్న సమావేశం అయింది. బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో ప్రతినిధులు, అధికారులు సమావేశం అయింది. అసెంబ్లీకి రాకుండా జీత భత్యాలు తీసుకుంటూ అసెంబ్లీ రూల్స్ ను పాటించని వారికి నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. గతంలో రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ.. ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పారు.
నిజమే మరి. ఎందుకంటే వ్యవస్థలను, చట్టాలను గౌరవించడం ఒక ప్రజాప్రతినిధి ప్రథమ విధి. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ అలాంటి పనులు చేయట్లేదు. జగన్ సీఎం పదవి లేకపోతే అసెంబ్లీకి కూడా రాకపోవడం ఏంటి. ప్రజలు గెలిపించింది అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై చర్చించమనే కదా. కానీ ఆ పని చేయకుండా జీత భత్యాలు తీసుకుంటూ వ్యవస్థలను అగౌరవ పరచడం ఏంటి. అసెంబ్లీకి రాని వారికి ఇప్పుడు నోటీసులు ఇవ్వడానికి అసెంబ్లీ కమిటీలు సిద్ధం అవుతున్నాయి.
దీంతో త్వరలోనే వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ నోటీసులు వెళ్లబోతున్నాయి. వాటిపై వాళ్లు ఏం మాట్లాడుతారు అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ప్రజలు వేసిన ఓటును కనీసం గౌరవించకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అంటున్నారు కూటమి నేతలు. చంద్రబాబు నాయుడును ఎన్ని సార్లు అవమానించినా సరే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతెత్తారు. కానీ ఇప్పుడు కూటమి అసెంబ్లీని అత్యంత హుందాగా నడిపిస్తున్నా సరే వైసీపీ ఇలా అవమానించడంపై ప్రజల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.