ఏపీలో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు -అచ్చెన్నాయుడు
Atchannaidu: రాష్ట్రంలో పెరిగిపోతోన్న నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.;
ఏపీలో పోలీసులు, వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెరిగిపోతోన్న నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం కొత్తపేట నుంచి నిర్వహించతలపెట్టిన బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.