ఇటీవల దాడి నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో డీఎస్పీ లతో భద్రత కల్పిస్తారు. సీఎం రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్‌కు ఒక డీఎస్పీ ఇద్దరు సీఏలు, నలుగురు ఎస్సైలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే సీఎం రోడ్‌షోలు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి.
సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి రూ.2లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. వివరాలు తెలిస్తే 9490619342, 9440627089 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కోరారు.
రాయి దాడి ఘటనపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద తనను పరామర్శించేందుకు వచ్చిన నేతలతో మాట్లాడుతూ.. ‘బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రాణాపాయం తప్పింది. మరోసారి అధికారంలోకి వస్తున్నాం.. ఆందోళన వద్దు. ఎలాంటి దాడులూ నన్ను ఆపలేవు. ధైర్యంతో ముందడుగు వేద్దాం’ అని పేర్కొన్నారు.