Wedding Dates : పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఇవే..

Update: 2024-08-05 04:45 GMT

నేటి నుంచి శ్రావణ మాసం మొదలైంది. ఈ నెల శివపూజకు విశిష్టమైనదిగా పూజలు, వ్రతాలకు ప్రసిద్ధి అని హిందువులు నమ్ముతారు. శ్రావణ సోమవారాలు శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే శుభప్రదమని పండితులు అంటారు. కొత్తగా పెళ్లైన యువతులు ఈ మాసంలో మంగళవారాలు గౌరీ వ్రతాలు చేసుకుంటే సుమంగళిగా ఉంటారని విశ్వసిస్తారు. శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీ వత్రం ఆచరిస్తే ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం.

శ్రావణమాసం రావడంతో శుభకార్యాలకు ముహూర్తాలు వచ్చాయని పండితులు తెలిపారు. ఆగస్టు 7 నుంచి 28 వరకు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు లాంటి శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. ఆగస్టు 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీలు మంచివి అని.. 17, 18 తేదీలు అత్యంత శుభముహూర్తాలు అని వివరించారు. కాగా గురు, శుక్ర మూఢాలు రావడం వల్ల గత 3 నెలలుగా వివాహాలకు బ్రేక్ పడింది.

Tags:    

Similar News