Balakrishna: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన బాలకృష్ణ..
Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఇబ్బంది ఉన్నా.. ధైర్యంగా ముందుకు వెళ్లామన్నారు బాలకృష్ణ.;
Balakrishna (tv5news.in)
Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఇబ్బంది ఉన్నా.. ధైర్యంగా ముందుకు వెళ్లామన్నారు బాలకృష్ణ. అఖండ సినిమాను ఇంత సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడే సినిమాగా అఖండ అందరి మన్ననలూ పొందిందన్నారు. చిత్ర పరిశ్రమను కాపాడుకోవడం తమ లక్ష్యమన్నారు.
టికెట్ల విషయంలో గతంలో తాను మాట్లాడానని, ఇప్పుడు ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తానంటోంది కాబట్టి ఆ తర్వాత స్పందిస్తానని బాలయ్య చెప్పారు. అఖండ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించిన సందర్భంగా విజయవాడ వచ్చిన ఆయన.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. చిత్రబృందంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మంగళగిరి వెళ్లారు. అక్కడ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్నారు.