వైసీపీ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.;
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని ఆయన ఆరోపించారు. హిందు దేవాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏపీ బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని.. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ కార్యకర్తలు బలవంతులని తెలిపారు.
దేవాలయాలపై దాడులకు సీఎం జగన్ మూల్యం చెల్లించాల్సి వస్తోందని హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం ఖాయమని సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ రెండు కొండలు అంటోందని.. గోవిందుడివే ఏడు కొండలు అనేది బీజేపీ సిద్ధాంతమన్నారు.