BC WAR: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ హైడ్రామా

అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం

Update: 2025-10-18 04:00 GMT

తె­లం­గా­ణ­లో బీసీ రి­జ­ర్వే­ష­న్ల అమ­లు­కు అఖి­ల­ప­క్షం­తో ప్ర­ధా­ని నరేం­ద్ర మోడీ ని కల­వా­ల­ను­కు­న్న అపా­యిం­ట్ ఇవ్వ­లే­ద­ని డి­ప్యూ­టీ సీఎం మల్లు భట్టి వి­క్ర­మా­ర్క ఆరో­పిం­చా­రు. తె­లం­గాణ బీ­జే­పీ నే­త­లు అపా­యిం­ట్‌­మెం­ట్ ఇప్పి­స్తే ప్ర­ధా­ని­కి కలు­స్తా­మ­ని తె­లి­పా­రు. కానీ, బీసీ రి­జ­ర్వే­ష­న్ల­ను బీ­జే­పీ అడ్డు­కుం­టుం­ద­ని, నేటి బంద్ ఆ పా­ర్టీ­కి వ్య­తి­రే­కం­గా జర­గు­తోం­ద­ని సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. డి­ప్యూ­టీ సీఎం మల్లు భట్టి వి­క్ర­మా­ర్క చే­సిన ఆరో­ప­ణ­ల­పై బీ­జే­పీ ఎంపీ రఘు­నం­ద­న్ రావు స్ట్రాం­గ్ కౌం­ట­ర్ ఇచ్చా­రు. ఓట్ల కో­స­మే కాం­గ్రె­స్ పా­ర్టీ బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై డ్రా­మా­లు ఆడు­తోం­ద­ని మం­డి­ప­డ్డా­రు. కాం­గ్రె­స్ పా­ర్టీ నుం­చి ఎన్ని­కైన 10 మంది బీసీ బి­డ్డ­ల­కు మం­త్రు­లు­గా అవ­కా­శం ఇవ్వా­ల­న్నా­రు. స్థా­నిక ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చే ఉద్దే­శం కాం­గ్రె­స్ కి లేనే లే­ద­న్నా­రు.

బీసీ రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు

బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్ల బి­ల్లు ని­లి­చే­ది కా­ద­ని మాజీ మం­త్రి శ్రీ­ని­వా­స్ గౌడ్ అన్నా­రు. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం కే­వ­లం.. జీ­వో­లు వి­డు­దల చే­య­డం వల్ల ప్ర­యో­జ­నం ఉం­డ­ద­ని అభి­ప్రా­య­ప­డ్డా­రు. కేం­ద్ర, రా­ష్ట్ర ప్ర­భు­త్వా­లు ని­ర్ణ­యం తీ­సు­కొ­ని చట్ట­బ­ద్ధ­త­ను కల్పిం­చ­డం ద్వా­రా­నే బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు అమలు అవు­తా­య­ని చె­ప్పా­రు. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం తీ­రు­తో బీ­సీల ఆశ­ల­పై నీ­ళ్లు పో­సి­న­ట్లు అయ్యిం­ద­న్నా­రు. బీసీ బంద్ కు తమ పా­ర్టీ సం­పూ­ర్ణ మద్ద­తు ఇస్తుం­ద­ని శ్రీ­ని­వా­స్ గౌడ్ వె­ల్ల­డిం­చా­రు.

కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్

బీ­సీల బం­ద్‌­కు తె­లం­గాణ జా­గృ­తి అధ్య­క్షు­రా­లు కల్వ­కుం­ట్ల కవిత మద్ద­తు ఇచ్చా­రు. ఈ క్ర­మం­లో కాం­గ్రె­స్, బీ­జే­పీ­పై వి­రు­చు­కు­ప­డ్డా­రు. బీ­సీల రి­జ­ర్వే­ష­న్ల పెం­పు­పై మా­ట్లా­డేం­దు­కు ఆ రెం­డు పా­ర్టీ­ల­కు అర్హత లే­ద­న్నా­రు. తె­లం­గాణ అసెం­బ్లీ, కౌ­న్సి­ల్ పాస్ చే­సిన బి­ల్లు­ల­ను ఆమో­దిం­చ­కుం­డా నెలల తర­బ­డి పెం­డిం­గ్‌­లో పె­ట్టిన బీ­జే­పీ ఇప్పు­డు బం­ద్‌­లో పా­ల్గొ­న­టం ఏం­ట­ని క్వ­శ్చ­న్ చే­శా­రు. కాం­గ్రె­స్, బీ­జే­పీ కలి­సి బీ­సీ­‌­ల­ను వం­చి­స్తు­న్నా­య­న్నా­రు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు.

"బీజేపీని బద్నాం చేయాలని చూస్తుండ్రు"

స్థా­నిక సం­స్థ­ల్లో బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై కాం­గ్రె­స్ సర్కా­ర్ బీ­సీ­ల­ను, ప్ర­జ­ల­కు దగా చే­స్తోం­ద­ని బీ­జే­పీ ఎంపీ డీకే అరుణ తీ­వ్ర ఆరో­ప­ణ­లు చే­శా­రు. బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై కాం­గ్రె­స్ పా­ర్టీ­కి అసలు చి­త్త­శు­ద్ధే లే­ద­ని అన్నా­రు. అసలు ప్ర­భు­త్వ వి­ధా­న­మే సరి­గ్గా లే­ద­ని.. బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై ఇచ్చిన జీవో కో­ర్టు­లో ని­ల­బ­డ­ద­ని తాను అప్పు­డే చె­ప్పా­న­ని కా­మెం­ట్ చే­శా­రు. బీ­సీ­ల­ను, ప్ర­జ­ల­ను రా­ష్ట్ర ప్ర­భు­త్వం దగా చే­స్తోం­ద­ని ఫైర్ అయ్యా­రు. బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై దేశ అత్యు­న్నత న్యా­య­స్థా­నం సు­ప్రీం­కో­ర్టు ఇచ్చిన తీ­ర్పు అం­ద­రూ ఊహిం­చి­న­దే­న­ని అన్నా­రు. స్థా­నిక ఎన్ని­క­ల్లో లబ్ధి కో­స­మే ఈ డ్రా­మా­ల­కు తెర లే­పా­ర­ని తీ­వ్ర ఆరో­ప­ణ­లు చే­శా­రు. బీసీ రి­జ­ర్వే­ష­న్ల వి­ష­యం­లో బీ­జే­పీ­ని బద్నాం చే­సేం­దు­కు ప్ర­య­త్నం చే­స్తు­న్నా­ర­ని కా­మెం­ట్ చే­శా­రు. అసెం­బ్లీ­లో బీసీ బి­ల్లు­కు తాము ఆమో­దం తె­లి­పిం­ది వా­స్త­వం కాదా అని ప్ర­శ్నిం­చా­రు. బీసీ రి­జ­ర్వే­ష­న్ల­కు బీ­జే­పీ అడ్డు పడు­తోం­ద­ని కాం­గ్రె­స్ వి­మ­ర్శి­స్తోం­ద­ని డీకే అరుణ అన్నా­రు.

Tags:    

Similar News