అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో పెన్నోబిలేష్ అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. సీతాఫలాల పండ్ల కోసం చిన్న ఎర్రగొండ అనే కొండ అటవీ ప్రాంతం లో వెతుకుతుండగా ఒంటరిగా ఉన్న వ్యక్తిని చూసి ఎలుగుబంటి దాడి చేసి తీవ్ర గాయపరిచింది. గాయపడిన పెన్నోబులేష్ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుందుర్పి అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లు తరచూ సంచరిస్తున్నాయని స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురవుతున్నాయని అటవీశాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఎలుగుబంట్లను కట్టడి చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.