భోగాపురం ఎయిర్ పోర్టుపై జగన్ డబుల్ యాక్షన్

Update: 2026-01-05 07:37 GMT

భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం గత ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభం అయ్యిందని రాసుకొచ్చారు. తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన పురోగతి కారణంగానే ఈ రోజు భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్‌ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇది ఏపీ అభివృద్ధి మార్గంలో ఒక కీలక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ ట్వీట్‌పై తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి కారణం టీడీపీ అని చెబుతున్నారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. రాష్ట్ర విమానయాన రంగంలో ఇదో కీలక మైలురాయి అని రాసుకొచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ప్రాంతీయ కనెక్టివిటీ బలోపేతమవుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ఇప్పుడు టేకాఫ్‌కు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ విమానశ్రయ నిర్మాణాన్ని కేంద్ర చెప్పినట్లు గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, కట్టుబడి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం అని చెప్పారు. గత ప్రభుత్వంలోని అరాచక పాలన కారణంగా ఎయిర్‌పోర్ట్ పనులు ఆశించినంత ముందుకు సాగలేదని వివరించారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్‌లో తొలి విమానం ల్యాండ్ కావడానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం అని వెల్లడించారు.

ఎయిర్‌పోర్ట పనులు 96 శాతం పూర్తి అయినట్లు జీఎంఆర్ సంస్థ తెలిపింది. భోగపురం విమానాశ్రయం నిర్మాణానికి 2,200 ఎకరాల పైగా భూమి కేటాయించి, సుమారు రూ.4,592 కోట్లు వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో సుమారు 40 లక్షల ప్రయాణీకుల సామర్థాన్ని కలిగి ఉండనుంది, లాంగ్ టైంలో 4 కోట్ల ప్రయాణీకుల సామర్ధ్యాన్ని చేరుకునే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతంగా ఈ ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద విమానాలు – A380 తరహా విమానాలు కూడా ల్యాండ్‌ అయ్యే సామర్ధ్యం ఉన్న రన్‌వే డిజైన్ చేశారు.


Full View

Tags:    

Similar News