బెజవాడ దుర్గ గుడి ఈవోగా భ్రమరాంబకు బాధ్యతలు..!
బెజవాడ దుర్గ గుడి ఈవోగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఈవో సురేశ్‌బాబు.. రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా బదిలీ అయ్యారు.;
బెజవాడ దుర్గ గుడి ఈవోగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఈవో సురేశ్‌బాబు.. రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో భ్రమరాంబ దుర్గ గుడి ఈవోగా వచ్చారు. ఛార్జ్ తీసుకున్న అనంతరం.. తాను రాజమహేంద్రవరం నుంచి బదిలీపై వచ్చానని, అమ్మవారి సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందని భ్రమరాంబ అన్నారు. అందరి సహకారంతో ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు.