AP Government : ఏపీ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ..!
ఏపీ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ నగరపాలక సంస్థ తొలగించిన ఫ్యూజన్ ఫుడ్స్‌పై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.;
ఏపీ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ నగరపాలక సంస్థ తొలగించిన ఫ్యూజన్ ఫుడ్స్‌పై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఫ్యూజన్ ఫుడ్స్ తొలగింపు అక్రమం అని సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై.. రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వం, ఫ్యూజన్ ఫుడ్స్ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వం అప్పీల్‌ను కొట్టివేసింది. వారం రోజుల్లో ఫూజన్ ఫుడ్స్ యాజమాన్యానికి పొజిషన్ అప్పగించాలని ఆదేశించింది.