ycp: ఉప ఎన్నిక వేళ వైసీపీకి బిగ్ షాక్

Update: 2025-08-08 13:55 GMT

కడప జి­ల్లా­లో రెం­డు జడ్పీ­టీ­సీ స్థా­నా­ల­కు జరు­గు­తో­న్న ఉప ఎన్నిక ఇప్పు­డు ఏపీ రా­జ­కీ­యా­ల్లో వేడి పు­ట్టి­స్తోం­ది. ఓవై­పు పు­లి­వెం­దుల, మరో వైపు ఒం­టి­మి­ట్ట జడ్పీ­టీ­సీ ఉప ఎన్ని­క­ల్లో గె­లి­చే­సేం­దు­కు అటు వై­ఎ­స్‌­ఆ­ర్‌ కాం­గ్రె­స్‌ పా­ర్టీ.. ఇటు కూ­ట­మి పా­ర్టీ­లు సర్వ­శ­క్తు­లు ఒడ్డు­తు­న్నా­యి.. అయి­తే, ఒం­టి­మి­ట్ట జడ్పీ­టీ­సీ ఉప ఎన్ని­కల వేళ వై­సీ­పీ­కి షా­క్‌ తగి­లి­న­ట్టు అయ్యిం­ది.. మం­త్రి మం­డి­ప­ల్లి రాం­ప్ర­సా­ద్ రె­డ్డి సమ­క్షం­లో వై­ఎ­స్ఆ­ర్‌ కాం­గ్రె­స్‌ పా­ర్టీ­కి చెం­దిన ఒం­టి­మి­ట్ట ఎం­పీ­పీ అక్కి లక్ష్మి దేవి, ఉప మం­డ­లా­ధ్య­క్షు­రా­లు గీతా.. తె­లు­గు­దే­శం పా­ర్టీ­లో చే­రా­రు.. వీ­రి­తో­పా­టు పలు­వు­రు వై­సీ­పీ నా­య­కు­లు టీ­డీ­పీ­లో చే­ర­గా, వా­రి­కి మం­త్రి రాం­ప్ర­సా­ద్‌­రె­డ్డి.. టీ­డీ­పీ కం­డు­వా­లు కప్పి.. పా­ర్టీ­లో­కి ఆహ్వా­నిం­చా­రు.. వి­ద్యా­వం­తు­లు టీ­డీ­పీ­లో­కి స్వ­చ్ఛం­దం­గా వచ్చి చే­ర­డం ఆనం­దం­గా ఉం­ద­న్నా­రు మం­త్రి రాం­ప్ర­సా­ద్ రె­డ్డి.. ఆయ­న­తో పాటు జి­ల్లా అధ్య­క్షు­డు జగ­న్మో­హ­న్ రాజు, టీ­డీ­పీ శ్రే­ణు­లు పా­ల్గొ­న్నా­రు.. అనం­త­రం గ్రా­మం­లో ఇం­టిం­టి ప్ర­చా­రం ని­ర్వ­హిం­చా­రు. ఈ ఎన్ని­క­ల్లో ఎలా­గై­నా గె­లి­చి సత్తా చా­టా­ల­ని వై­సీ­పీ- టీ­డీ­పీ బలం­గా భా­వి­స్తు­న్నా­యి. దీం­తో పు­లి­వెం­దు­ల­లో ఉద్రి­క్త పరి­స్థి­తు­లు నె­ల­కొ­న్నా­యి.

కడప జి­ల్లా పు­లి­వెం­దు­ల­లో తె­లు­గు­దే­శం పా­ర్టీ ఫ్లె­క్సీ­ల­ను గు­ర్తు­తె­లి­య­ని వ్య­క్తు­లు తగ­ల­బె­ట్టా­రు. పు­లి­వెం­దుల జడ్పీ­టీ­సీ ఉపఎ­న్ని­కల సం­ద­ర్భం­గా పలు­చో­ట్ల రహ­దా­రి­కి ఇరు­వై­పు­లా టీ­డీ­పీ ప్లె­క్సీ­ల­ను ఏర్పా­టు చే­సిం­ది. నా­లు­గు రో­జుల నుం­చి ఈ ప్రాం­తం­లో వై­సీ­పీ, టీ­డీ­పీ వర్గాల మధ్య ఘర్ష­ణ­లు జరు­గు­తు­న్నా­యి. ఈక్ర­మం­లో పు­లి­వెం­దుల మం­డ­లం కొ­త్త­ప­ల్లి రో­డ్డు పక్కన కట్టిన ఫ్లె­క్సీ­ల­ను గు­ర్తు­తె­లి­య­ని వ్య­క్తు­లు తగ­ల­బె­ట్టా­రు. టీ­డీ­పీ నేత బీ­టె­క్ రవి, అభ్య­ర్థి లతా­రె­డ్డి­తో పాటు జి­ల్లా నా­య­కుల పో­స్ట­ర్ల­తో వె­ల­సిన ఫ్లె­క్సీ­ల­ను కా­ల్చి­వే­శా­రు. ఈ ఘట­న­పై టీ­డీ­పీ శ్రే­ణు­లు పు­లి­వెం­దుల పో­లీ­సు­ల­కు ఫి­ర్యా­దు చే­సి చర్యలు తీసుకోవాలని కోరాయి.

Tags:    

Similar News