మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. నేటితో రిమాండ్ ముగియడంతో ఆయన్ను జైలు అధికారులు వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు కేసులో వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులోనూ ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఆయనకు కోర్టు ఈ నెల 15 వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో రిమాండ్ ముగిసిన వెంటనే, ఇదే విధంగా ఆన్ లైన్ పద్ధతిలో వంశీని కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది.