Kanna Laxminarayana : కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలం :కన్నా
Kanna Laxminarayana : ఏపీ సీఎం జగన్ కరోనాను సీరియస్ గా తీసుకోవడం లేదని మండిపడ్డారు బీజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ...;
Kanna Laxminarayana : ఏపీ సీఎం జగన్ కరోనాను సీరియస్ గా తీసుకోవడం లేదని మండిపడ్డారు బీజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ... కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గుంటూరులో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని సీఎంల సమావేశంలో మోదీ హెచ్చరించారన్నారు. అయినా ఏపీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనాను రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆస్పత్రిలో సౌకర్యాలు, వాక్సిన్ పై సీఎం సమీక్ష లేవని ప్రశ్నించారు. వైసీపీ మద్దతు లేని ఆస్పత్రులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన సమయంలో కూడా.. చర్చిల నిర్మాణం కోసం టెండర్లు పిలవడం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని... ఎంపీ రఘురామ విషయంలో తేలిపోయిందన్నారు.