వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ సోము వీర్రాజు..!
కడప జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర విడుదల చేసిన నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించదని ఆరోపించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.;
కడప జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర విడుదల చేసిన నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించదని ఆరోపించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 10 వేల కోట్లతో రైతులకు కేంద్రం పరికరాలు విడుదల చేస్తే.. వాటిని ఖర్చు చేయకుండా అన్యాయం చేసిందన్నారు. తక్షణమే రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సోము వీర్రాజు హెచ్చరించారు.