బోరుగడ్డ అనిల్‌కుమార్ పోలీసులు రాజమండ్రి సెంట్రాల్ జైలుకు తరలించారు. గురువారం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కాగా బోరుగడ్డ అనీల్ కుమార్ కు కోర్టు 29వరకు రిమాండ్ విధించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకు ముందు బోరుగడ్డ అనిల్ కు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో అనిల్ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. నాటి విపక్ష నేతలను దూషించారు. చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో యనపై కేసు ఫైల్ అయ్యింది. కాగా పోలీసుల విచారణలో వైసీపీ నేతల అండదండలతోనే తాను అలా చసినట్లు బోరుగడ్డ అనీల్ కుమార్ ఒప్పుకున్నట్టు సమాచారం.