AP BJP Chief Madhav : పవన్ పై కేసు.. స్టాలిన్ సర్కార్ పై ఏపీ బీజేపీ చీఫ్ ఫైర్

Update: 2025-07-03 08:00 GMT

తమిళనాడులో దుర్మార్గపు పాలన ఉందని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. సనాతన ధర్మం నాశనం అవ్వాలనే నీచమైన ఆలోచన కలిగిన ప్రభుత్వం అక్కడ ఉందన్నారు.

బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టడం మురుగన్ పై దాడిగా భావిస్తామని చెప్పారు. అన్నామలైకి అండగా పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారని.. ఈ సారి తమిళనాడులో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. కాగా మురుగన్ సదస్సులో నిబంధనలు ఉల్లంఘించి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని మాధవ్ అన్నారు. కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలతో సమన్వయం చేసుకుని ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టామని.. రాష్ట్రంవలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. కేంద్రం సహకారంతో రాష్ట్రానికి మరిన్ని నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేస్తామన్నారు.

Tags:    

Similar News