Ys Viveka Murder case : వివేకా హత్య కేసు.. సీబీఐ అధికారి పై కేసు నమోదు..!

Ys Viveka Murder case : వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై స్థానిక రిమ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.;

Update: 2022-02-23 03:25 GMT

Ys Viveka Murder case : వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై స్థానిక రిమ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసు విచారణ పేరుతో ఆయన తనను వేధిస్తున్నారని పులివెందుల బాకరాపురానికి చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 15న ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేశ్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

కేసుకు సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదని, వారు చెప్పినట్లు వినాలని వేధించడంతో పాటు తనను మానసిక, శారీరక ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపించారు. అనంతరం కడప కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కేసు నమోదు చేయాలని ఈ నెల 18న కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రామ్‌సింగ్‌పై ఐపీసీ 195ఏ, 323, 506 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద రిమ్స్‌ సీఐ సదాశివయ్య కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News