సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ..!
CM Jagan : ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది..;
CM Jagan : ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణ జరుపుతోంది కోర్టు. ఈనెల ఒకటిన జరిగిన విచారణ సందర్భంగా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని జగన్, రఘురామకృష్ణరాజుతోపాటు సీబీఐని కోర్టు ఆదేశించింది.. కోర్టు ఆదేశాలతో జగన్, రఘురామ లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించబోమని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు విచారణను కోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.