YS Vivekananda Reddy: వివేకా హత్యకేసు దర్యాప్తులో సీబీఐ సంచలన ఆరోపణలు..

YS Vivekananda Reddy: వివేకా హత్యకేసు దర్యాప్తులో సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది.;

Update: 2022-03-16 07:45 GMT

YS Vivekananda Reddy: వివేకా హత్యకేసు దర్యాప్తులో సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో మెజిస్ట్రేట్‌ ముందు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమైన సీఐ శంకరయ్య, గంగాధర్‌ రెడ్డి, కృష్ణారెడ్డి వంటి వారు... ప్రలోభాలు, బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గారని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. ఆ తర్వాత సీఐ శంకరయ్యకు ప్రభుత్వం నుంచి పోస్టింగ్‌ కూడా దక్కిందని వివరించింది.

ప్రస్తుతం గంగిరెడ్డి మినహా... మిగిలిన నిందితులంతా జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారని... ఆతనకు కూడా పులివెందుల కోర్టు ఇచ్చిన బెయిన్‌ను రద్దు చేయాలని హైకోర్టును సీబీఐ కోరింది. ఇప్పటికే వివేకా కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న వాచ్‌మెన్‌ రంగన్న, అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరికి భద్రత కల్పించాలని కడప కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. ఇప్పుడు గంగిరెడ్డి కారణంగా సాక్షులకు భద్రత కరువవుతుందని సీబీఐ ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడే సంచలనంగా మారింది.

Tags:    

Similar News