CBN: 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన... అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటన.. 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం శ్రీకారం.. ఉగాదిలోపు 5 లక్షల గృహ ప్రవేశాలు చేస్తాం

Update: 2025-11-13 02:30 GMT

తమది పేదల ప్ర­భు­త్వ­మ­ని.. వా­రి­కి న్యా­యం చే­సేం­దు­కు శక్తి­వం­చన లే­కుం­డా పని­చే­స్తా­మ­ని ఏపీ ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఇళ్లు లేని పేదల పే­ర్లు నమో­దు చే­స్తు­న్నా­మ­ని పే­ర్కొ­న్నా­రు. ఆయా కు­టుం­బా­ల­ను కలి­పేం­దు­కు పక్క­ప­క్క­నే రెం­డు ఇళ్లు ఇస్తా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. ఇం­టి­పై సో­లా­ర్ పె­ట్టు­కు­నే­లా ప్రో­త్స­హి­స్తా­మ­ని ప్ర­క­టిం­చా­రు. ఇళ్ల­పై, పొ­లా­ల్లో కరెం­ట్ తయా­రు చే­యి­స్తు­న్నా­మ­ని వి­వ­రిం­చా­రు. సో­లా­ర్, విం­డ్, వా­ట­ర్‌­తో వి­ద్యు­త్ ఉత్ప­త్తి చే­స్తు­న్నా­మ­ని చె­ప్పు­కొ­చ్చా­రు. అన్న­మ­య్య జి­ల్లా పర్య­ట­న­లో భా­గం­గా చి­న్న­మం­డెం మం­డ­లం దే­వ­గు­డి­ప­ల్లి­లో ప్ర­భు­త్వ పక్కా గృ­హా­ల్లో గృ­హ­ప్ర­వే­శాల కా­ర్య­క్ర­మం­లో సీఎం చం­ద్ర­బా­బు పా­ల్గొ­న్నా­రు. మూడు లక్షల గృ­హా­ల­ను వర్చు­వ­ల్‌­గా ము­ఖ్య­మం­త్రి ప్రా­రం­భిం­చా­రు. 17 నె­ల­ల్లో ఇళ్లు పూ­ర్తి­చే­సి లబ్ధి­దా­రు­ల­కు పం­పి­ణీ చే­శా­రు ప్ర­జా­వే­ది­క­లో పక్కా గృ­హాల లబ్ధి­దా­రు­ల­తో సీఎం చం­ద్ర­బా­బు ము­ఖా­ము­ఖి ని­ర్వ­హిం­చా­రు. ఉగా­ది లోపు 5 లక్షల గృహ ప్ర­వే­శా­లు జరి­గే­లా చే­స్తా­మ­ని చం­ద్ర­బా­బు హామీ ఇచ్చా­రు.

పేదవాడికి సొంతిల్లు ఉండాలి..

ఆర్థిక ఇబ్బం­దు­లు­న్నా పథ­కా­లు అమలు చే­స్తు­న్నా­మ­ని ఉద్ఘా­టిం­చా­రు. ఒక్క­రో­జే రా­ష్ట్రం­లో మూ­డు­ల­క్షల ఇళ్ల­కు గృహా ప్ర­వే­శా­లు చే­యి­స్తు­న్నా­మ­ని వి­వ­రిం­చా­రు. మి­గి­లిన ఇళ్లు కూడా వే­గం­గా పూ­ర్తి చేసి త్వ­ర­లో­నే అప్ప­గి­స్తా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. ని­న్న(మం­గ­ళ­వా­రం) కని­గి­రి­లో 97 పరి­శ్ర­మ­లు ప్రా­రం­భిం­చా­మ­ని తె­లి­పా­రు. ప్ర­తి కు­టుం­బం­లో ఒక పా­రి­శ్రా­మి­క­వే­త్త తయా­రు కా­వా­ల­ని సూ­చిం­చా­రు. ప్ర­తి ని­యో­జ­క­వ­ర్గం­లో MSME పా­ర్కు­లు ఏర్పా­టు చే­స్తా­మ­ని ఉద్ఘా­టిం­చా­రు.మహి­ళ­ల­ను పా­రి­శ్రా­మి­క­వే­త్త­లు­గా తయా­రు­చే­సే బా­ధ్యత తన­ద­ని పే­ర్కొ­న్నా­రు. 2029 నా­టి­కి పే­ద­ల­కి సొం­తి­ల్లు ఉం­డా­ల­నే­ది తన లక్ష్య­మ­ని నొ­క్కి­చె­ప్పా­రు. ఇళ్లు అంటే నా­లు­గు గో­డ­లు కా­ద­ని.. భవి­ష్య­త్‌­కు భద్రత అని అభి­వ­ర్ణిం­చా­రు. గృ­హ­ని­ర్మాణ రం­గం­లో కొ­త్త దశ ప్రా­రం­భ­మ­వు­తోం­ద­ని, పేద కు­టుం­బాల కలల ఇల్లు ఇప్పు­డు వా­స్తవ రూపం దా­లు­స్తుం­ద­ని తె­లి­పా­రు. గతం­లో, జగ­న­న్న కా­ల­నీ పే­రు­తో ఇళ్ల స్థ­లా­లు కే­టా­యిం­చి వది­లే­సా­ర­ని, అక్కడ రో­డ్లు, నీరు, వి­ద్యు­త్ వంటి సౌ­క­ర్యా­లు కూడా కల్పిం­చ­లే­ద­ని ఆయన వి­మ­ర్శిం­చా­రు. అడ­వు­లు, చె­రు­వుల దగ్గర స్థ­లా­లు ఇచ్చి ప్ర­జల జీ­వి­తా­ల­తో జగన్ ప్ర­భు­త్వం ఆట­లా­డిం­ద­ని మం­డి­ప­డ్డా­రు.

వైసీపీ వల్లే...

కేం­ద్ర ప్ర­భు­త్వం తా­గు­నీ­టి పథకం ప్ర­వే­శ­పె­ట్టి­నా గత ప్ర­భు­త్వం దా­న్ని ఉప­యో­గిం­చు­కో­లే­ద­ని చం­ద్ర­బా­బు వి­మ­ర్శిం­చా­రు. రా­య­చో­టి ని­యో­జ­క­వ­ర్గా­ని­కి త్వ­ర­లో ఇం­టిం­టి­కి నీ­ళ్ళు అం­ది­స్తా­మ­ని హామీ ఇచ్చా­రు. అలా­గే, రా­ష్ట్రం మొ­త్తం నదుల అను­సం­ధా­నం తన జీ­విత లక్ష్య­మ­ని చె­ప్పా­రు. ఇప్ప­టి­కే గో­దా­వ­రి – కృ­ష్ణా అను­సం­ధా­నం వి­జ­య­వం­త­మైం­ద­ని, గంగా – కా­వే­రి అను­సం­ధా­నం చే­స్తే దేశం మొ­త్తా­ని­కి నీటి కొరత ఉం­డ­ద­ని పే­ర్కొ­న్నా­రు.. మరో­వై­పు, గతం­లో వి­ద్యు­త్‌ కష్టా­లు ఉం­డే­వి.. కానీ, ఇప్పు­డు, ప్ర­తి ఇం­టి­కి సొం­తం­గా వి­ద్యు­త్ ఉత్ప­త్తి చే­సు­కు­నే­లా సో­లా­ర్ వ్య­వ­స్థ­లు ఏర్పా­టు చే­స్తు­న్నా­మ­ని సీఎం తె­లి­పా­రు. రై­తు­లు తమ పొ­లా­ల్లో సో­లా­ర్ వి­ద్యు­త్ ఉత్ప­త్తి చే­స్తే, ప్ర­భు­త్వం ప్రై­వే­ట్ కం­పె­నీల రే­టు­కే కొ­ను­గో­లు చే­స్తుం­ద­న్నా­రు. మహి­ళ­ల­ను పా­రి­శ్రా­మి­క­వే­త్త­లు­గా తయా­రు చేసే బా­ధ్యత తన­ద­ని.. 2029 నా­టి­కి ప్ర­తి పే­ద­వా­డి­కి సొం­తి­ల్లు ఉం­డా­ల­నే­ది ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని చె­ప్పా­రు.

Tags:    

Similar News