CBN: క్రిమినల్ మాస్టర్‌మైండ్‌కు ఉదాహరణ జగన్
సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో జగన్ పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్‌వి ఇంకా చాలా నేర కార్యకలాపాలు ఉన్నాయని ఆక్షేపించారు. ఏపీలో జగన్ పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎలా ఉంటుందో జగన్ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. వివేకా హత్య తరహాలో.... ఇప్పుడు మళ్లీ నేరాలు, ఘోరాలు చేసి ఏపీలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. జగన్ అండ్ కో క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు కల్తీ మద్యం వ్యవహారం కూడా అలాగే చేశారని విమర్శించారు. పోలీసు అధికారులు దర్యాప్తు సమగ్రంగా చేస్తున్న కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ అండ్ కో చేసిన నేరాన్ని తెలుగుదేశం నేతల మీదకు నెట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకే ప్రయోజనం చేకూర్చే "Next Gen GST" సంస్కరణలను ప్రధాని మోదీ నాయకత్వంలో అమలు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. GST తాజా సంస్కరణల వల్ల ఆర్థిక లాభాలు, ప్రజలకు నేరుగా సేవింగ్స్ అందుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలులో నిర్వహించనున్న ‘ సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ’ సభకు రావాలని ప్రధానిని ఆహ్వానించారు. అసలాగే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న "CII Partnership Summit 2025" కు కూడా ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ కు ఢిల్లీలో అవగాహన ఒప్పందం జరుగనుంది. దాదాపు 480 ఎకరాల్లో రూ.87,520 కోట్ల పెట్టుబడి రైడెన్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. జిల్లాలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం పరిధిలో మూడు అతి పెద్ద డేటా సెంటర్లు రానున్నాయి. ఇందుకు అవసరమైన భూమిని గూగుల్ సంస్థే ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేయనుంది.