Amaravati: అమరావతిలో సెంటు భూమి పథకం.. ఆగమేఘాల మీద కదులుతున్న సీఆర్డీఏ ఫైల్స్

Amaravati: అమరావతిలో సెంటు భూమి పథకంపై ఆగమేఘాల మీద సీఆర్డీఏ ఫైల్స్ కదులుతున్నాయి.;

Update: 2023-04-03 07:32 GMT

Amaravati: అమరావతిలో సెంటు భూమి పథకంపై ఆగమేఘాల మీద సీఆర్డీఏ ఫైల్స్ కదులుతున్నాయి. ఇతర ప్రాంతాల వారికి సెంటు భూమి పట్టాలు ఇచ్చేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 1130 ఎకరాలను కేటాయిస్తు జీవో నెంబర్‌ 45 రిలీజ్‌ చేసింది జగన్ సర్కారు. గుంటూరు కలెక్టర్‌కు 550, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు 583 ఎకరాలు కేటాయించింది. ఎకరానికి కోటి రూపాయల ధరగా ప్రభుత్వ నిర్ణయించింది. ధరను మళ్లీ సమీక్షించుకోవచ్చంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది.కాసేపట్లో సీఎం జగన్‌తో సీఆర్డీఏ అథారిటీ భేటీ కానుంది. సీఆర్డీఏ సమావేశంలో ఆమోదంతో..రాజధాని ప్రాంతంలో బయటివారికి పట్టాలు కేటాయించనుంది ప్రభుత్వం. రైతుల అభ్యంతరాలు పట్టించుకోకుండా ఇప్పటికే ఆర్-5 జోన్ ఏర్పాటు చేశారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఇతర ప్రాంతాల వారికి సెంట్‌ భూమి పథకాన్ని వ్యతిరేకిస్తూ... ఇవాళ హైకోర్టులో రాజధాని రైతులు లంచ్‌మోషన్ పిటిషన్ వేయనున్నారు.

Similar News