ఏపీలో ABCD పాలనంటూ చంద్రబాబు విమర్శలు
జగన్‌రెడ్డి కొత్తగా ఏబీసీడీ పాలన తెచ్చారంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు;
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కొత్తగా ఏబీసీడీ పాలన తెచ్చారంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. కర్నూలులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో YCP తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏ అంటే ఎటాక్స్, బి అంటే బాదుడు, సి అంటే కరప్షన్, డి అంటే డిస్ట్రక్షన్ అని ధ్వజమెత్తారు. ఆటవిక పాలన, నడ్డి విరిగేలా పన్నులు, హోల్‌సేల్‌గా దోచేయడం, అమరావతిలో లక్ష కోట్ల ఆస్తిని ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు చంద్రబాబు.