ఏపీలో లాక్‌డౌన్ పెట్టాల్సిందే.. చంద్రబాబు డిమాండ్
ఏపీలో లాక్‌డౌన్ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అత్యంత ప్రమాదకరమైన N440k కరోనా వేరియంట్ ఏపీలో వ్యాప్తిలో ఉందని హెచ్చరించారు.;
Nara chandrababu Naidu (File Photo)
ఏపీలో లాక్‌డౌన్ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అత్యంత ప్రమాదకరమైన N440k కరోనా వేరియంట్ ఏపీలో వ్యాప్తిలో ఉందని హెచ్చరించారు. ఇది ఇతర వైరస్ రకాల కన్నా 10 రెట్లు అధిక ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు సైతం హెచ్చరించారన్నారు చంద్రబాబు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తొలిసారి కర్నూలులో ఈ రకం వైరస్ బయటపడిందని, ఇప్పటికే 30 శాతం వరకు వ్యాప్తి చెందిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బెడ్ల కొరత ఉందని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ అంగీకరించారన్నారు. టీకాల కొరత, ఆక్సిజన్ కొరతతో విపత్తుగా మారుతోందని, మరింత తీవ్రస్థాయికి వెళ్లకుండా అరికట్టాలంటే ఏపీలో లాక్‌డౌన్‌కు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఒడిశాలో 14 రోజుల లాక్ డౌన్ విధించిన విషయాన్ని గుర్తు చేశారు.