Chandrababu : జనం గెలవాలంటే జగన్‌ ఓడాలి

సుపరిపాలన అందిస్తామని చంద్రబాబు హామీ.... వైసీపీని భస్మం చేయాలని పిలుపు

Update: 2024-03-28 02:15 GMT

ఆంధ్రప్రదేశ్‌లో పన్నుల బాదుడులేని సుపరిపాలన అందిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. చేనేత కార్మికలకు 500 యూనిట్ల వరకూ.. ఉచిత విద్యుత్‌ను ఇస్తామని ప్రకటించారు. రాయలసీమను నాశనం చేసి ఎన్నికల పేరుతో. పరదాలు దాటి బయటకు వస్తున్న జగన్‌కు ఎవరూ స్వాగతం పలకవద్దని పిలుపునిచ్చారు. జనం గెలవాలంటే జగన్‌ గద్దె దిగాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. NDA గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం

చేపట్టారు. పలమనేరు, పుత్తూరు సభల్లో పాల్గొన్న ఆయన.... ప్రజల ఆవేదనను అగ్నిగా మార్చి వైసీపీను భస్మం చేయాలని పిలుపునిచ్చారు. తొలుత పలమనేరు సభలో పాల్గొన్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసి జగన్‌ రాయలసీమని రాళ్ల సీమగా మార్చారని ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్న జగన్‌కు ఎవరూ స్వాగతం పలక వద్దని సూచించారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు తాము కూడా సిద్ధమని స్పష్టంచేశారు.

వైసీపీ నేతల అరాచకాలు తారస్థాయికి చేరాయని చంద్రబాబు ఆక్షేపించారు. మైనార్టీలకు జగన్‌ ఏం చేశారని ప్రశ్నించారు. NDAలో తెలుగుదేశం చేరితే..... సీఎం జగన్‌ విమర్శలు చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. అనంతరం పుత్తూరు సభలో పాల్గొన్న చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే రోజా నగరి నియోజకవర్గాన్ని అరాచకాలతో నింపేశారని ఆరోపించారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్న కేంటీన్లను తీసేసిన జగన్‌.... తాను పేదలపక్షమని చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్‌ పాలనలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయామని...... ఏపీని కాపాడుకునేందుకే మూడు పార్టీలు కలిసి నడుస్తున్నాయని పునరుద్ఘాటించారు. తర్వాత మదనపల్లె చేరుకున్న చంద్రబాబు... బెంగళూరు బస్టాండ్ కూడలిలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ముసుగు వీరుడు సీఎం జగన్‌ బయటకు వస్తున్నారని ఇంటికి పంపేదుకు సిద్ధమవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు జనం గెలవాలంటే జగన్‌ గద్దె దిగాల్సిందేనని ఉద్ఘాంటించారు. ప్రజల ఆవేదనను అగ్నిగా మార్చి... వైసీపీను భస్మం చేయాలని పిలుపునిచ్చారు.

మేం ఉన్నప్పుడు ఐదేళ్లపాటు కరెంట్‌ ఛార్జీలు పెంచలేదు. పేదల కష్టాలు ఏమాత్రం తెలియని వ్యక్తి జగన్‌. రూ.60ల మద్యాన్ని రూ.200లకు అమ్ముతున్నారు. ఈ ఐదేళ్లలో మీ ఆదాయం పెరిగిందా.. తగ్గిందా? పేదలను నిరుపేదలుగా మార్చిన పెత్తందారు జగన్‌. పేదల జీవితాల్లో వెలుగులు చూపించే బాధ్యత నాది. మహిళలను వేధించిన వారు బాగుపడినట్టు ఎక్కడా లేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆడబిడ్డ నిధి ఇస్తాం. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తాం. అన్నదాత కింద రైతుకు ఏటా రూ.20వేలు ఇస్తాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తాం. మేం వచ్చాక ఐదేళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెరగవు. చేనేత కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తెస్తాం. నగరిలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నాది’’ అని ప్రకటించారు.  

Tags:    

Similar News