సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను సీరియస్‌గా తీసుకోవాలని AP సర్కార్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్న వారిని వదిలిపెట్టవద్దని పోలీసులకు సూచించింది. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటుచేసింది. అడ్డగోలుగా పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేసేందుకు సైతం వెనుకాడొద్దని ప్రభుత్వం పోలీస్ డిపార్టుమెంట్ కు సూచించింది. దీంతో.. పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను గుర్తించి వారిలో పలువురికి BNS సెక్షన్ 179 కింద నోటీసులు జారీ చేశారు. దేశం దాటిపోతున్న వారి కోసం లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేయాలనుకుంటున్నారు. కొందరిని పోలీసులు కిడ్నాప్ చేసి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు వారి బంధువులు