Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో యువతకు భారీగా సీట్ల కేటాయింపు..

Chandrababu: టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కీలక ప్రకటన చేశారు ఆపార్టీ అధినేత చంద్రబాబు.

Update: 2022-03-30 01:23 GMT

Chandrababu: టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కీలక ప్రకటన చేశారు ఆపార్టీ అధినేత చంద్రబాబు. తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాలపైనా ఉందన్నారు. యువత ముందుకు వచ్చి న్యాయంకోసం పోరాడాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో యువతకు 40శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. పేదరికం పోవాలన్నా, సామాన్యుల కష్టాలు తీరాలన్నా తెలుగుదేశం అధికారంలోకి రావాలన్నారు.

Tags:    

Similar News