Andhra Pradesh : త్రివర్ణ పతాక రూపకర్తకు చంద్రబాబు, లోకేష్ ఘన నివాళులు.

Update: 2025-08-02 10:45 GMT

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా తెలుగు జాతి ఆయనను స్మరించుకుంటుంది. తెలుగు రాష్ట్రాలలో పింగళి వెంకయ్య 149వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పింగళి వెంకయ్యకు నివాళులు అర్పిస్తున్నారు.

జాతీయ పతాకం ఎగురుతున్నంత కాలం పింగళి వెంకయ్య మనకు గుర్తుండి పోతారని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తన జీవితాన్ని భరత మాత సేవ కోసమే ఉపయోగించిన మహనీయుడు అని పేర్కొన్నారు. కోట్ల మంది భారతీయులు గర్వించే త్రివర్ణ పతాకాన్ని అందించిన యోధుడుకి నివాళులర్పిద్దాం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. కాగా ఏపీ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ సైతం పింగళి వెంకయ్య సేవలను స్మరించుకున్నారు. ఆ మహనీయుడు తెలుగు వారు కావడం మన అందరి అదృష్టం అని.. బహుముఖ ప్రజ్ఞాశాలి గా పేరు గడించిన పింగళికి అందరూ నివాళులు అర్పించాలని తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు లోకేష్.

Tags:    

Similar News