AP CM : రుషికొండ ప్యాలెస్ చూస్తే నాకే కళ్లు తిరుగుతున్నాయి: సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వం సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. రూ.431 కోట్ల ప్రజాధనంతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారని, దాన్ని చూస్తే తనకే కళ్లు తిరుగుతున్నాయని చెప్పారు. ‘రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకున్నారు. సాక్షికి రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. రూ.500 కోట్లు ఖర్చు చేసి ఉంటే రోడ్లు బాగయ్యేవి’ అని పేర్కొన్నారు. జగన్ 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం చేశారని, జీవోలు కూడా ఆన్‌లైన్‌లో ఉంచలేదన్నారు. జగన్ చీకటి పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. భూమి ఉంది కాబట్టే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, అందుకే అమరావతి కోసం భారీగా భూమి కావాలనుకున్నామని వివరించారు.