Chandrababu Naidu : నీటి ప్రాజెక్టులపై వైసీపీ కుట్రలు.. బయటపెట్టిన చంద్రబాబు..

Update: 2026-01-08 07:15 GMT

ఏ చిన్న సందు దొరికినా సరే అందులో నిజానిజాలు అన్నీ కప్పిపుచ్చేసి తప్పుడు ప్రచారాలు చేయడం వైసీపీకి బాగా అలవాటు అయిపోయింది. ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు మీద బురదజల్లడమే ప్రధాన టార్గెట్ గా పెట్టుకుని వైసీపీ ఇలాంటి పనులకు పాల్పడుతోంది. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఆపేసిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు అన్ని రకాల విషయాలను బయటపెట్టారు. జగన్ ఎప్పుడూ ప్రాజెక్టులకు అడ్డంకిగానే ఉన్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమతో పాటు ఏపీకి అద్భుత ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. కానీ దాన్ని వైసీపీ పక్కన పెట్టేసిందని తెలిపారు.

తాను సీఎంగా ఉన్నప్పుడు పట్టిసీమ ప్రాజెక్టును చేపడితే.. అది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేసింది. కానీ దాని నుంచే రాయలసీమకు నీళ్లు ఇచ్చినట్టు సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఇదే ప్రాజెక్టుకు అనుసంధానంగా గొళ్లపల్లి ప్రాజెక్టు కట్టి కియా కంపెనీని తెచ్చినట్టు తెలిపారు. రాయలసీమకు ఉపయోగపడేలా తాను మొచ్చిమర్రి ప్రాజెక్టును కట్టానన్నారు. మొచ్చిమర్రి ప్రాజెక్టుతో రాయలసీమకు ఎన్నో లాభాలుండేవి. దాన్ని వైసీపీ ఆపేసిందని ఆధారాలతో బయటపెట్టారు.

ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టును తాను ఆపానని చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు. కేవలం కాంట్రాక్టుల నుంచి డబ్బులు వసూలు చేయడం కోసం పర్మిషన్లు తీసుకోకుండా రాయలసీమ ప్రాజెక్టును చేపట్టి రూ.2వేల కోట్లు వృథాగా ఖర్చు పెట్టారని చంద్రబాబు బయటపెట్టారు. పర్మిషన్లు లేకపోతే ఎన్జీటీకి రూ.100 కోట్ల ఫైన్ కట్టినట్టు గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు వైసీపీ హయాంలోనే ఆగిపోతే ఇప్పుడు తనమీద నిందలు వేయడానికి ట్రై చేస్తున్నారని అన్నీ వివరించారు. దీంతో వైసీపీ అసలు కుట్రలు మొత్తం బయటపడ్డాయి. ఇన్ని రోజులు కూటమిపై బుదర జల్లేందుకు ట్రై చేసి ఇప్పుడు వారే బురదలో పడ్డారని కూటమి నేతలు అంటున్నారు.

Tags:    

Similar News