కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలను కూడా పూర్తిస్థాయిలో అందజేస్తోంది. వైసిపి పాలనలో ధ్వంసం అయిపోయిన అభివృద్ధిని తిరిగి తీసుకొస్తుంది. ఓవైపు అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఏపీకి తీసుకొస్తూ.. ఇంకోవైపు రైతులకు అన్ని విధాలుగా మేలు మేలు చేస్తుంది కూటమి. అన్ని వర్గాల ప్రజలకు భేదాభిప్రాయాలు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇంత చేస్తున్నా సరే ప్రజల నుంచి రావాల్సిన స్పందన మాత్రం కరువైపోయింది. కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు రాకపోవడంపై చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారు.
ఇదే విషయాన్ని టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. కార్యకర్తలు, లోకల్ లీడర్లు కచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. పార్టీకి రావాల్సిన మైలేజ్ మిస్ అవుతోందని చెప్పారు. అభివృద్ధి ఫలాలను, అందుతున్న సంక్షేమ పథకాలను కచ్చితంగా ప్రజలకు వివరించాలని చెప్పారు. గతంలో ఉన్న వైసిపి ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందో.. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా దాన్ని గాడిన పెడుతుందో తేడా వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులనే కాకుండా.. గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా వివరిస్తేనే మైలేజ్ ఎక్కువ వస్తుందని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఆ విషయాలు చెప్పకుండా కేవలం పనులు చేసుకుంటూ పోతే లాభం లేదంటున్నారు.
ఈ రోజుల్లో చేసిన పనిని పదిమందికి చెప్పుకుంటేనే రాజకీయ పార్టీలకు మనుగడ అనేది ఉంటుందని చంద్రబాబు నాయుడు సూచించారు. వైసిపి హయాంలో పారిపోయిన కంపెనీలను ఇప్పుడు ఏపీకి తీసుకొచ్చారు. అప్పుడు బీటలు వారిన భూములను ఎప్పుడు పంట పొలాలు చేశారు. అప్పుడు రాజధాని లేకుండా చేస్తే ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది అమరావతి రెడీ అవుతోంది. కాబట్టి వీటన్నింటినీ వివరిస్తూ టిడిపికి ప్రజల నుంచి మద్దతు కూడగట్టాలని చంద్రబాబు చెబుతున్నారు.