Chandrababu Naidu : రాయలచెరువును పరిశీలించిన చంద్రబాబు

Chandrababu Naidu :తిరుపతి రాయలచెరువును పరిశీలించారు టీడీపీ అధినేత చంద్రబాబు. చెరువు పరిస్థితిపై వివరాలు తెలుసున్న చంద్రబాబు... అవసరమైతే ఐఐటీ నిపుణులతో దీని భద్రతను అంచనా వేయించాలన్నారు

Update: 2021-11-24 15:15 GMT

Chandrababu Naidu :తిరుపతి రాయలచెరువును పరిశీలించారు టీడీపీ అధినేత చంద్రబాబు. చెరువు పరిస్థితిపై వివరాలు తెలుసున్న చంద్రబాబు... అవసరమైతే ఐఐటీ నిపుణులతో దీని భద్రతను అంచనా వేయించాలన్నారు. ఈ చెరువు భద్రతపై ప్రజల్లో అనేక ఆందోళనలు ఉన్నాయని.. ఆ ఆందోళనలు తొలగించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వరదల్నిఅలర్ట్‌ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు చంద్రబాబు.

అంతకు ముందు.. రాయలచెరువు పరిశీలనకు అనుమతి లేదంటూ.. చంద్రబాబుకు నోటీసులిచ్చారు పోలీసులు. రాయలచెరువును రెడ్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో....పర్యటనకు అనుమతిలేదన్నారు. అయితే.. ఈ నోటీసులు తీసుకోని చంద్రబాబు... చంద్రగిరి నుంచి రాయలచెరువుకు వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. చంద్రబాబు పర్యటనతో.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయలచెరువుద్ద పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు.

రాయలచెరువు దిగువన 112 గ్రామాలున్నాయి. ఈ చెరువు కట్టతెగితే ఊళ్ళకు ఊళ్ళను కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. బోదగుట్ట నుంచీ కుప్పం బాదూరు అడవుల నడుమ శ్రీకృష్ణదేవరాయల కాలంలో దీన్ని నిర్మించారు. ఇది దాదాపు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో, 60 మీటర్ల ఎత్తులో బలమైన కట్ట కట్టారు. క్రమంగా చెరువు మూడో వంతుకు పైగా ఆక్రమణలకు గురైంది.1991లో వచ్చిన వరదల్లో ఓసారి చెరువుకు లీకేజీ కనిపించింది.

ఇప్పుడు మరోసారి లీకేజీ రావడంతో.. ఆందోళన వ్యక్తమవుతోంది. పది వేల మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోన్న రాయలచెరువు స్థితికి బాధ్యులెవరన్న ప్రశ్న 

Tags:    

Similar News