సీఎం చంద్రబాబు నాయుడు ఎంత ముందు చూపుతో వ్యవహరిస్తారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జరుగుతున్న పనులు, పెట్టుబడుల విషయంలో ఆయన ఖచ్చితమైన నిర్ణయాలతో ముందుకు వెళుతుంటారు. మిగతా రాష్ట్రాల కంటే ముందే కీలక విషయాలను పసిగట్టి అందుకు తగ్గట్టు ప్లాన్ రెడీ చేస్తారు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఎంపీలకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, బడ్జెట్ లో స్పెషల్ కేటాయింపులు, ఇతర విషయాలపై తన వ్యూహాలను వారికి వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి.. దాన్ని వినియోగించుకొని ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎంపీలు కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. ఆయా కేంద్ర మంత్రులను ఎప్పటికప్పుడు కలుస్తూ.. ఏపీలో అమరావతి, పోలవరం, పనులు వేగవంతం అయ్యేలా కావాల్సిన నిధుల గురించి కేంద్ర పెద్దలతో ఏం మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాలను సూచించారు సీఎం చంద్రబాబు.
ఓవైపు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత బడ్జెట్ లో అమరావతికి 15 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ నిధులతో రాజధానిలో చాలా పనులు చేయించారు సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఏపీకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను ఏర్పాటు చేయాలంటే నిధులు తప్పనిసరి. కాబట్టి ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో అమరావతి కోసం కావాల్సిన నిధులను కేటాయించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. 2027లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాబట్టి పోలవరం పనులను ఓవైపు శరవేగంగా చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీకి అత్యంత కీలకమైన అమరావతి, పోలవరం పూర్తి చేయడంలో కేంద్రం సహకారం కొంత తప్పనిసరి.
ఎందుకంటే వైసిపి హయాంలో మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అప్పుల ఊబిలో పడేశారు వైసిపి నేతలు. ఎలాంటి అభివృద్ధి చేయకపోగా అవినీతి, కుంభకోణాల పేరుతో రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారు. కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం సహకారం రాష్ట్రానికి అవసరం అవుతుంది. దాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఏపీని ముందుకు నడిపిస్తున్నారు.