వైసిపి హయాంలో ఏపీ ఎంత దారుణంగా విధ్వంసం అయిందో అందరూ కళ్ళారా చూశారు. అసలే కొత్త రాష్ట్రం పెట్టుబడులను ఎక్కువగా తీసుకురావాల్సింది పోయి వస్తాను అన్నవాళ్లను కూడా వైసిపి నేతలు వేధింపులకు గురి చేసి భయపెట్టి రాకుండా చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్నా సరే మేము ఏపీకి రాబోమని ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇచ్చారు. అంత దారుణంగా వైసిపి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించింది. అలాంటి అరాచకాలు వద్దని కూటమి ప్రభుత్వంకు ఏపీ ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రజలు ఏ నమ్మకాన్ని అయితే పెట్టుకున్నారో దాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పెట్టుబడులను తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎందుకంటే అమరావతితో పాటు ఏపీ వ్యాప్తంగా పెట్టుబడులు వస్తేనే మిగతా రాష్ట్రాలతో పోటీ ఉంటుంది. ఇప్పుడు గనక నిర్లక్ష్యం చేస్తే ఏపీకి భవిష్యత్తులో పెట్టుబడులు అనేవి రానే రావు. అందుకే చంద్రబాబు నాయుడు తన పట్టుదల ఓపికతో రాను అన్న పారిశ్రామికవేత్తలనే ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చేశారు. దాన్ని వాళ్లే స్వయంగా అనేక వేదికల మీద చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న లీడర్ ఉంటే ఎలాంటి పెట్టుబడులకు అయినా ఢోకా ఉండదని వాళ్లే ఓపెన్ గా చెబుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేడు మరోసారి మీడియా ముఖంగా పంచుకున్నారు.
వద్దు అన్న వాళ్ళతోనే ఏపీకి రప్పించడం అంటే బ్రాండ్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేసినట్టే అవుతుందని చెబుతున్నారు. అంతే కదా రాను అన్న వాళ్ళను పక్కన పెట్టేసి కొత్త వాళ్లను వెతుక్కుంటే అది సక్సెస్ కాదు. వద్దన్న వాళ్ళని ఏపీకి రప్పిస్తే మిగతా వాళ్ళు ఆటోమేటిక్ గా ఏపీకి వచ్చేస్తారు. ఇదే విషయం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. మరోసారి అరాచక వైసిపి పాలన రాదు అనే నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు కాబట్టి పెట్టుబడులు వరదలాగా ఏపీకి వస్తుంది. ఏపీకి ఇప్పటికే 13 లక్షల 26 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయి. మొన్ననే ఎస్ఐపిబీ 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. దీనివల్ల ఏడు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏపీ యువతకు కావాల్సింది కూడా ఇదే కదా. మిగతా పెట్టుబడులకు కూడా త్వరలోనే ఆమోదం చెప్పబోతోంది ఏపీ ప్రభుత్వం. అప్పుడు ఏపీకి జాబుల జాతరే నడుస్తుంది.