Nara Chandhra Babu : చంద్రబాబు విజన్.. మెగాసిటీగా విశాఖ

Update: 2025-11-21 13:45 GMT

సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ విజన్ తో ఏపీని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. మరీ ముఖ్యంగా ఏపీలోని మూడు ప్రాంతాలకు అభివృద్ధి చేరువయ్యేలా ప్రణాళిక రచిస్తున్నాడు. అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో విశాఖను, మధ్యలో అమరావతిని, రాయలసీమలో తిరుపతిని మెగా సిటీలుగా మార్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విశాఖకు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకువచ్చి ఎవరూ ఊహించని రేంజ్ లో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖకు వచ్చేశాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని విశాఖను ఆ రేంజ్ లో తీర్చిదిద్దుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఒక గ్లోబల్ సిటీకి ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నింటిని ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు.

ఎందుకంటే అంతర్జాతీయ కంపెనీలు రావాలంటే ఆ స్థాయి ప్రమాణాలు కచ్చితంగా ఉండి తీరాల్సిందే కదా. అందుకే విశాఖకు ఏమేం కావాలో అన్ని ఇప్పటికే అరేంజ్ చేసి పెట్టారు. వాటిని చూపిస్తూ అంతర్జాతీయ కంపెనీలను తీసుకువస్తున్నారు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ రావడం ఒక పెద్ద అచీవ్మెంట్. దాంతోపాటు టిసిఎస్, క్వాంటం కంపెనీలు కూడా వచ్చేశాయి. మొన్న సీఐఐ సమ్మిట్ లో ఏకంగా 600కు పైగా ఒప్పందాలు జరిగాయి. ఇంకోవైపు విద్యాలయాలు, మెగా ప్రాజెక్టులు వచ్చి పడుతున్నాయి. ఇవన్నీ వెరసి విశాఖ రూపురేఖలను మార్చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖ సిటీ అద్భుతంగా డెవలప్ అవుతుంది.

మరికొన్ని రోజుల్లోనే విశాఖను మెగాసిటీగా నామకరణం చేయడంతో పాటు దానికి తగ్గ మెగా ప్లాన్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. విశాఖ బ్రాండ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటిపోయింది. అంతర్జాతీయ బిజినెస్ ప్లాట్ ఫామ్ పై కూడా విశాఖ పేరు వినిపిస్తోందంటే అదంతా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల వల్లే అని చెప్పుకోవచ్చు. గూగుల్ డేటా సెంటర్ అమెరికా తర్వాత అతిపెద్ద పెట్టుబడి విశాఖలోనే పెట్టింది అంటూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. దీంతోపాటు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అంతర్జాతీయ కంపెనీలను కలిసి మరీ విశాఖ గురించి వివరిస్తూ ప్రచారం చేయడంతో.. పెట్టుబడులకు విశాఖ ఒక హబ్ అనే ప్రచారం విశ్వవ్యాప్తంగా జరుగుతోంది. ఒక సిటీకి ఇంతకంటే ఇంకేం కావాలి అంటున్నారు విశాఖపట్నం ప్రజలు.


Full View

Tags:    

Similar News